Published On:

Arunachal Pradesh: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, వక్రబుద్ది చూపించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌కు మళ్లీ పేర్ల మార్పు..

Arunachal Pradesh: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, వక్రబుద్ది చూపించిన చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌కు మళ్లీ పేర్ల మార్పు..

China Attempt to rename Certain Places of Arunachal Pradesh: సరిహద్దుల్లో పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు సద్దుమణుగుతున్న వేళ డ్రాగన్ దేశం చైనా మరోసారి తన వక్రబద్దిని చూపించింది. ఈశాన్య భారతంలోని సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లు మార్చి చైనా తమ బోర్డులు పెట్టింది. దీనిని భారత్‌ తీవ్రంగా ఖండించింది. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రానా వాస్తవాలు మారవని చైనా తెలుసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ అసహనం చూపించింది. ఇది వ్యర్థ ప్రయత్నం.. అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమే అంటూ చైనాకు నొక్కి చెప్పింది.

 

అరుణాచల్ ప్రదేశ్‌ను కొన్ని స్థలాలను సౌత్‌ టికెట్‌గా చైనా పేర్లు మార్చింది. ఆయ ప్రాంతాలను జాంగ్‌నాన్‌గా రిఫర్‌ చేస్తూ చైనా బోర్డులు పెట్టింది. టిబెట్‌కు ద‌క్షిణ భాగంగా అరుచల్‌ ప్రదేశ్‌ని రిఫర్‌ చేస్తూ తమ మ్యాప్‌లో చూపించుకుంటోంది. చైనా తీరును తాజాగా భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పందించారు. “పేర్లు మార్చే ప్ర‌క్రియ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ‌తంలో రెండు దేశాల ప్ర‌భుత్వాలు ఆదేశాలు ఇచ్చాయి. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. ఆ రాష్ట్రాన్ని మా నుంచి వేరు చేయ‌లేరు. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవలు మారిపోవు. ఇది మా వైఖరికి విరుద్ధం. అలాంటి ప్రయత్నాలను ఖచ్చితంగా తిరస్కరిస్తాం” ఆయన పేర్కొన్నారు.

 

అయితే చైనా ఇలా చేయడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఎన్నో సార్లు హిమచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలు పేర్లు మార్చే ప్రయత్నం చేసింది. కానీ దీనికి ఎప్పటికప్పుడు భారత్‌ తిప్పికొట్టింది. గతేడాది ఏప్రిల్‌లో హిమచల్‌లోని ముప్ఫై ప్రాంతాలకు చైనా, టిబెటిన్లు పేర్లు పెట్టింది. దీంతో భారత్‌ టిబెల్‌లోని పలు ప్రాంతాలకు భారత్‌ పేర్లు పెట్టింది. ఇలా చైనా ఐదు సార్లు హిమచల్‌ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు పేర్లు మార్చే ప్రయత్నం చేసింది. ప్రతిసారి భారత్‌ వాటిని తిప్పికొట్టింది.