Ajit doval: ఇండియన్ జేమ్స్ బాండ్ దోవల్, ఈయనే ఓ పాశుపతాస్త్రం

Ajit doval: ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న ఆపరేషన్ లో ఒకే ఒక వ్యక్తి దేశం ప్రజలను ఆకర్షిస్తున్నాడు. అతనే అజిత్ దోవాల్. జాతీయ భద్రతా సలహాదారు. 80 ఏళ్ల వయసులో ఆయన ఎంత చురుకుగా పనిచేస్తున్నారో యావత్ దేశ ప్రజలు గమనించే ఉంటారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆపరేషన్ బ్లూస్టార్ నుంచి కందహార్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు తాజాగా ఇండియా- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పడు ఆయన పక్కా ప్లానింగ్‌తో శత్రువును చిత్తు చేసే ఎత్తుగడలు వేసి శభాష్ అనిపించుకున్నారు.
కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దోవాల్ సేవలను వాడుకుంటున్నారు మోదీ.. ఆయనకు ఎన్‌ఎస్‌ఏ చీఫ్ పదవిని అప్పగించారు. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రంలోని కేబినెట్ మంత్రి హోదా కల్పించారు. ఇండియన్ జేమ్స్‌బాండ్‌గా కూడా ఆయన దేశ ప్రజలకు పరిచయమే. ఆపరేషన్ సింధూర్ లో దోవల్ పాత్ర ఎంతో ఉంది. ఆయన అనుభవం ఆపరేషన్ సింధూర్ ను విజయపథాకం ఎగరవేసేలా చేసింది. ఇటు టెర్రరిస్టులను మట్టుబెట్టడంతో పాటు అటు విదేశీ అధికారులతో దోవల్ కీలక చర్చలు చేశారు. భారత్ విదేశీ భూభాగంలోకి వెళ్లి మరీ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. దోవల్ ప్రపంచ దేశాలకు పరిస్థితిని అందుకు భారత్ చేసిన చర్యలను తెలియజేశారు.
ఇండియన్ ఆర్మీ దెబ్బకు పాకిస్తాన్ కు దిమ్మ తిరిగింది. భారత బలగాలను కాచుకోవడం ఇక తమ వల్ల కాదని పాకిస్తాన్ సైన్యం డిసైడ్ అయింది. దీంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా ను శరణుజొచ్చింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ చకచకా పావులు కదిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. అయితే పాకిస్థాన్ లోని అనుస్థావరం భారత్ దాడిలో దెబ్బతినిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే పాకిస్తాన్ భయంతో వెనక్కి తగ్గింది.
పాకిస్తాన్ అణుస్థావరం నుంచి రేడియేషన్ వెలువడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఉగ్ర చేష్టలను కట్టిడి చేసే క్రమంలో భారత్ ఆపరేషన్ సింధూర్ కు తెరలేపింది. దీంతో భారత్ శక్తి ప్రపంచానికి తెలియవచ్చింది. ఆపరేషన్ సింధూర్ తో దేశ ప్రజల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదన్న సంకేతాలు పంపారు ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాదు పాకిస్తాన్ ప్రజలు అలాగే సైనిక స్థావరాలపై ఎప్పుడూ దాడులు జరపకుండా ఎంతో సంయమనంతో నరేంద్ర మోడీ వ్యవహరించారు.