Last Updated:

Arvind Kejriwal: లెఫ్టినెంట్ గవర్నర్ తో కేజ్రీవాల్ భేటీ

గవర్నర్ వ్యవస్ధ రాజకీయంగా మారిందని పదే పదే విమర్శిస్తూ కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో భేటి కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Arvind Kejriwal: లెఫ్టినెంట్ గవర్నర్ తో కేజ్రీవాల్ భేటీ

Delhi: గవర్నర్ వ్యవస్ధ రాజకీయంగా మారిందని పదే పదే విమర్శిస్తూ కేంద్రం పై దుమ్మెత్తిపోస్తున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో భేటి కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీ మద్యం పాలసీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయని నిబంధనలు ఉల్లంఘించారని, లోపాలతో కూడిన పాలసీని తీసుకొచ్చారని సిఎం కేజ్రీవాల్ ప్రభుత్వం పై స్వయానా గవర్నర్ సిబిఐకి ఫిర్యాదు చేసారు. దీంతో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో పాటుగా పలువురు ప్రముఖుల నివాసాల పై సిబిఐ దాడులు చేపట్టింది. ఈ క్రమంలో వీరిద్దరి భేటికి ప్రాధాన్యత సంతరించుకొనింది. రాజకీయ జోక్యం కావడంతో పాటుగా ఢిల్లీ వ్యవహారంలో లెప్టినెంట్ గవర్నర్ కు ఉన్న విశేష అధికారంతో తొలి నుండి కేజ్రీవాల్, సక్సేనాల మద్య యుద్దం వాతావరణం చోటు చేసుకుంటూనే ఉంది. అనేక బిల్లులను పక్కన పెట్టిన సందర్భాలు లేకపోలేదు.

ఇవి కూడా చదవండి: