Published On:

Rajnath Singh : పాక్‌కు గట్టి సమాధానం ఇచ్చాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : పాక్‌కు గట్టి సమాధానం ఇచ్చాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Defence Minister Rajnath Singh : ఉగ్రదాడిలో అమాయకులను చంపిన వారినే లక్ష్యంగా చేసుకున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. హనుమంతుడు అనుసరించిన సూత్రాన్నే భారత్ అనుసరించిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌పై ఆయన స్పందించారు. బుధవారం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 బీఆర్వో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. భారత సాయుధ దళాలు తమ శౌర్యం, ధైర్యాన్ని ప్రదర్శించి నూతన చరిత్రను లిఖించాయని ప్రశంసించారు.

 

సున్నితత్వంతో ఇండియా సైనిక దళాలు చర్యలు చేపట్టాయని తెలిపారు. నిర్ణయించిన లక్ష్యాలను సరైన సమయంలో ధ్వంసం చేశామని చెప్పారు. పౌర జనాభా ఏ మాత్రం ప్రభావితం కాకుండా చూసుకోవడంలో సాయుధ దళాలు సున్నితత్వాన్ని చూపించాయని కొనియాడారు. భారతీయ జవాన్లు మానవత్వాన్ని చూపించారని తెలిపారు. దేశం తరఫున జవాన్లు, అధికారులను అభినందించారు. సాయుధ దళాలకు మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీని అభినందనలు తెలిపారు.

 

పహల్గాం ఉగ్రదాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకున్నది. బుధవారం తెల్లవారుజామున అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా విరుచుకుపడింది. 9 ఉగ్రవాద శిబిరాలు, శిక్షణా కేంద్రాలను ఇండియా యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఇండియా దాడిలో సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు తెలుస్తోంది. భారత వైమానిక దళంతోపాటు, నేవీ, ఆర్మీ కూడా ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

ఇవి కూడా చదవండి: