Published On:

నా కుటుంబాన్నే చంపేస్తారా? ప్రధాని మోదీకి మసూద్ వార్నింగ్

నా కుటుంబాన్నే చంపేస్తారా? ప్రధాని మోదీకి మసూద్ వార్నింగ్

Jaish-e-Mohammed chief Masood Azhar warns PM Modi : ఇండియా చెప్పినట్టే పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదులను వెంటాడి హతం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 9 ప్రాంతాల్లో దాడులు చేసింది. సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 10 మంది సభ్యులు, నలుగురు అనుచరులు మృతిచెందారు. ఘటనపై మసూద్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. వారు అల్లా దగ్గరకు వెళ్తారని నమ్ముతున్నట్లు చెప్పింది. ప్రధాని మోదీ తమకెంతో నష్టం చేశారని, ఈ త్యాగం వృథా కాదని స్పష్టం చేసింది. తమ వారి అమరత్వం శత్రువుల పతనానికి నాంది పలుకుతుందని చెప్పింది. చివరకు న్యాయమే గెలుస్తుందని పేర్కొంది.

 

గెట్‌ రెడీ..
తన కుటుంబ సభ్యుల మృతిపై మసూద్ అజార్ మండిపడ్డారు. అమాయకులను భారత ప్రధాని మోదీ టార్గెట్ చేశారని చెప్పుకొచ్చారు. గెట్‌ రెడీ అంటూ స్టేట్‌మెంట్‌ విడుదల చేశాడు. దాడులతో తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మోదీ యుద్ధ నియమాలను ఉల్లంఘించారంటూ ఒక ప్రకటన విడుదల చేశాడు. పాక్‌లోని బహవల్పూర్‌లోని మసీదు సుభాన్ అల్లాపై ఇండియా జరిపిన క్షిపణి దాడిలో తన అక్క, ఆమె కుటుంబంతో సహా తన కుటుంబ సభ్యులు 10 మంది మృతిచెందారని మసూద్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: