DOST 2025 : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల

DOST 2025 : రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 21 తేదీ వరకు ఆన్‌లైన్‌లో రూ.200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 10వ తేదీ నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 29న మొదటి ఫేజ్ సీట్ల అలాట్‌మెంట్ జరుగనుంది. మొదటి ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 30 నుంచి జూన్ 6వ తేదీలోపు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
రెండో ఫేజ్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగనుంది. రెండో ఫేజ్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 13వ తేదీన సెకండ్ ఫేజ్ సీట్లు కేటాయించనున్నారు. జూన్ 13వ తేదీ నుంచి 18 వరకు ఆయా కళాశాలల్లో ప్రత్యేక రిపోర్టు చేయాలి.
మూడో దశ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 13వ తేదీ నుంచి 19 వరకు కొనసాగనుంది. రిజిస్ట్రేషన్‌కు రూ. 400 చెల్లించాలి. జూన్ 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్ 23వ తేదీన సీట్ల కేటాయింపు చేస్తారు. జూన్ 23వ తేదీ నుంచి 28 తేదీ వరకు కళాశాలల్లో రిపోర్టు అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.