Home / students
25% free admissions for poor students in all private schools in AP: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి 25 శాతం ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వచ్చింది. ఈ క్రమంలో ఏపీలో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. […]
Student suicide : ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకొని కుటుంబానికి తీరని శోకం మిగుల్చుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తీవ్ర మనస్తాపానికి గురై ఇప్పటి వరకు 6 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అశ్విత తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో తీవ్ర […]
Andhra Pradesh News : ఈ రోజుల్లో కొందరు స్టూడెంట్స్ పరిస్థితి చూస్తుంటే.. ఇవేం చదువులు అనే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు ఉపాధ్యాయులు అంటే విద్యార్థులు భయపడేవారు. టీచర్లు అంటే గౌరవం కూడా ఉండేది. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్‌గా ఉంది. ఉపాధ్యాయులపై జోకులు వేయడం వంటివి చేస్తున్నారు. క్లాస్ రూమ్‌లో విద్యార్థులను టీచర్లు కొడితే.. తల్లిదండ్రులు మా అబ్బాయిని కొడతారా..? మా అమ్మాయిని బెరిస్తారా? అంటూ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థిని ఏకంగా ఉపాధ్యాయురాలిపై […]
Madhya Pradesh : విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుదొవ పట్టిస్తున్నారు. పిల్లలను చెడు అలవాట్లకు బానిసలుగా మార్చుతున్నారు. ఓ టీచర్ తన బాధ్యతను మరిచి విద్యార్థులకు మద్యం తాగించాడు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. పాఠశాలలో విద్యార్థులకు దగ్గరుండి మద్యం పోసి వారు తాగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని కఠ్నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బార్వారా బ్లాక్‌లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ […]
TG EAPCET 2025 : రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ 2025 పరీక్షలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి సంబంధించిన పరీక్షలు ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విభాగానికి మే 2 నుంచి 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈఏపీసెట్ పరీక్షలు రోజూ రెండు దశల్లో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి 12 […]
Telangana Education Department : తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రోజురోజుకూ ఎండలు మండిపోతుండగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. వేసవి సెలవులపై రకరకాల ప్రచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి […]
Telangana Inter Students : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల సొసైటీ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ సీట్లను ఎంట్రన్స్ పరీక్ష లేకుండా భర్తీ చేయాలని సొసైటీ నిర్ణయించింది. ప్రతి ఏటా మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. కానీ, ఇక నుంచి ఆ విధానాన్ని రద్దు చేసింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచి ప్రవేశ పరీక్ష లేకుండా […]
HCU Land Issue : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇవాళ హెచ్సీయూకు వెళ్తామని బీజేపీ నేతల బృందం తెలిపింది. దీంతో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. యూనివర్సిటీకి బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ సర్కారు భూముల అమ్మకానికి తెరలేపుతూ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కార్యక్రమానికి తెరలేపిందంటూ బీజేపీ […]
TGIIC : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హెచ్‌సీయూ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ పెంచారు. యూనివర్శిటీ లోపల, బయట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే టీజీఐఐసీ కీలక ప్రకటన […]
Tenth Exams : రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో ఎగ్జామ్ 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని అధికారులకు తెలియజేయంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు. అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన […]