Published On:

Fire Accident in Train: మరో రైలు ప్రమాదం.. డెమో ప్యాసింజర్‌లో మంటలు

Fire Accident in Train: మరో రైలు ప్రమాదం.. డెమో ప్యాసింజర్‌లో మంటలు

Fire Accident under Demo Passenger Train in Bibinagar: తెలంగాణలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బీబీనగర్ సమీపంలో రైలులో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం డెమో ప్యాసింజర్‌.. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్తుండగా బీబీనగర్ స్టేషన్ వద్దకు రాగానే రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా.. బీబీ నగర్ వద్ద రైలు నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

 

కాగా, ప్రయాణికులు తొలుత మంటలు వస్తున్న విషయాన్ని చూశారు. వెంటనే తొటి ప్రయాణికులతో అప్రమత్తమై రైల్వే సిబ్బందికి సమాచారం అంించారు. దీంతో రైల్వే అధికారులు హుటాహుటినా స్పందించి రైలును బీబీనగర్ స్టేషన్‌లో నిలిపివేశారు. కాగా, ఎవరికి గాయాలు, ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.

 

ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించిన వెంటనే రైల్వే సిబ్బంది సైతం ముందస్తుగా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చింది. దీంతో బీబీనగర్ రైల్వే స్టేషన్‌కు డెమో ప్యాసింజర్ రైలు వచ్చిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాప్తి చెందకుండా ఫైరింజన్‌తో అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఎవరికి నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు.

 

అయితే, ఈ ప్రమాదం తర్వాత భద్రతా తనిఖీలు చేశారు. ఆ తర్వాత అగ్నిమాపక నియంత్రణ చర్యలు చేపట్టడంతో బీబీనగర్ స్టేషన్‌లో డెమో ప్యాసింజర్ దాదాపు గంట సేపు అక్కడే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. అయితే ప్రయాణికుల సంక్షేమం కోసం తనిఖీలు చేసినట్లు అధికారులు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు.