Published On:

Fire Accident in Hyderabad: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 10 మంది!

Fire Accident in Hyderabad: పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 10 మంది!

Fire Accident in Hyderabad: హైదరాబాద్‌లోని పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాజ్‌గంజ్‌లోని ఓ ఇంట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్‌కు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. కాగా, ఈ మంటల్లో చిక్కుకున్న 10 మంది సిబ్బంది రక్షిస్తుంది.

 

వివరాల ప్రకారం.. మహారాజ్‌గంజ్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఉదయం మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో సిలిండర్ పేలింది. ఈ మంటల్లో చిక్కుకున్న వారిని పైర్ సిబ్బంది కాపాడారు. వృద్ధులు, నెలల పాపతో పాటు 9మందిని ఫైర్ ఫైటర్స్ క్షేమంగా కిందకు తీసుకొచ్చారు. మొత్తం 6 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.

 

ఇదిలా ఉండగా, షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఆ వెంటనే సిలిండర్ పేలిందని అనుమానిస్తున్నారు.  ఆ తర్వాత సమీపంలో ఉన్న ప్లాస్టిక్ గోడౌన్ దుకాణం వద్దకు మంటలు వ్యాపించాయి. అయితే ఇతర దుకాణాలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో గోల్ మసీదు ప్రాంతంలోని పరిసరాలు దట్టమైన పొగతో అల్లుకుపోయాయి.

 

అయితే, ఆ అపార్ట్ మెంట్‌లో పేపర్‌కు సంబంధించిన మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో మంటలు విపరీతంగా వ్యాపించాయని చెబుతున్నారు.  కాగా, ఫైర్ సిబ్బంది లేటెస్ట్ టెక్నాలజీతో మంటలను కేవలం 30 నిమిషాల్లోనే అదుపులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా ప్రాణ నష్టం కలగకుండా దృష్టి సారించి ఆ తర్వాత మంటలను కంట్రోల్ చేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చి మిగతా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.