Last Updated:

Heart Attack: వైరల్ వీడియో.. సీపీఆర్ చేసి యువకుడి ప్రాణం కాపాడిన పోలీస్

Heart Attack: గుండెపోటు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేం. అలాంటి తాజా ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అరాంఘర్ చౌరస్తా గల బస్‌స్టాప్‌లో ఒక్కసారిగా యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

Heart Attack: వైరల్ వీడియో.. సీపీఆర్ చేసి యువకుడి ప్రాణం కాపాడిన పోలీస్

Heart Attack: గుండెపోటు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేం. అలాంటి తాజా ఘటన ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అరాంఘర్ చౌరస్తా గల బస్‌స్టాప్‌లో ఒక్కసారిగా యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి.. యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు.. (Heart Attack)

రాజేంద్రనగర్ పరిధిలోని అరాంఘర్ చౌరస్తా వద్ద ఓ యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకులాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇది గమనించాడు. వెంటనే ఆ యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలను రక్షించాడు. సీపీఆర్ చేయకపోతే ఆ యువకుడు ప్రాణాలతో బయటపడేవాడు కాదని వైద్యులు అన్నారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో పూర్తిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన రాజశేఖర్‌ను పలువురు అభినందిస్తున్నారు.

కానిస్టేబుల్ కు అభినందనలు..

సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ ను అందరూ అభినందిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు రాజశేఖర్ ను సన్మానించారు. కానిస్టేబుల్ వ్యవహరించిన తీరుపై.. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌ ను ఎంతో అభినందిస్తున్నామని.. విపత్కర సమయంలో సీపీఆర్ చేసి విలువైన ప్రాణాలను కాపాడారని ట్వీట్టర్ ద్వారా ప్రశంసించారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని హరీష్ రావు అన్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్స్, వైద్య సిబ్బందికి సీపీఆర్ ఎలా చేయాలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. రాజశేఖర్ కర్తవ్యాన్ని అభినందిస్తున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఈ మేరకు రాజశేఖర్ ను సన్మానించారు. క్లిష్ట పరిస్థితిలో ప్రాణాలను కాపాడిన రాజశేఖర్ ధైర్యాన్ని డీజీపీ అభినందించారు.

వ్యాయమం చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి..

జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. హైదరాబాద్‌ లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బోయిన్ పల్లికి చెందిన విశాల్.. 2020 కి చెందిన బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఆసిఫ్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 24 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.