Published On:

Realme GT 7T First Look: దీన్ని కొట్టేదిలేదు.. 6000 mAh బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్.. ఫస్ట్ లుక్ ఇదే..!

Realme GT 7T First Look: దీన్ని కొట్టేదిలేదు.. 6000 mAh బ్యాటరీతో రియల్‌మీ కొత్త ఫోన్.. ఫస్ట్ లుక్ ఇదే..!

Realme GT 7T First Look, Price and Features: రియల్‌మీ ఈ వారం ప్రారంభంలో రియల్‌మీ GT 7 సిరీస్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సిరీస్ కింద, Realme GT 7Tని భారత మార్కెట్‌కి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కంపెనీ ఈ రాబోయే ఫోన్ ఫోటోను అధికారికంగా పంచుకుంది, దీనిలో దాని మొదటి లుక్ చూడవచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు లేదా ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు.

 

Realme GT 7T Launch Date

రియల్‌మీ GT 7T ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్‌లో లిస్టింగ్ చేశారు. ఇది ఫోన్ లభ్యతను నిర్ధారిస్తుంది. మొదటి ఫోటోను చూస్తే ఫోన్ ఎల్లో కలర్‌లో అందుబాటులో ఉందని స్పష్టంగా తెలుస్తుంది. దీని ఫ్రేమ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. వాల్యూమ్ బటన్లు బ్లాక్ కలర్‌లో ఉంటాయి. కంపెనీ ప్రకారం.. రియల్‌మీ GT 7T స్మార్ట్‌ఫోన్ మే 27, 2025న లాంచ్ అవుతుంది. ఇది ఎల్లో కలర్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. దీని ధర దాదాపు రూ. 34,000 నుండి ప్రారంభమవుతుంది.

 

Realme GT 7T Specifications

ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనికి LED రింగ్ లైట్ ఉంటుంది. హైపర్‌ఇమేజ్+ లోగో కూడా వెనుక ప్యానెల్‌పై ఉంచారు. దీని డిజైన్ చైనాలో ప్రారంభించిన GT 7 లాగానే ఉంది, ఇది గత నెలలో అంటే ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

 

కంపెనీ ఇంకా స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను వెల్లడించలేదు, కానీ లీక్స్ ప్రకారం.. మెరుగైన పనితీరు కోసం డైమెన్సిటీ 8400 కు బదులుగా డైమెన్సిటీ 9400+ ప్రాసెసర్ ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌లో 12 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

 

Realme C75 Price

రియల్‌మీ C75 ఇటీవలే లాంచ్ అయింది. ఇది సి-సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్, దీని ధర రూ. 12,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల HD+ IPS ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్,128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది. మొబైల్ ఫోన్‌లో 32MP కెమెరా ఉండగా, ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా అందించారు. దీని బ్యాటరీ 6000 mAh. దీనికి 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.