Published On:

Most Venomous Cobra: పొలం పనులకు వెళ్తుండగా కనిపించిన కింగ్ కోబ్రా.. పట్టుకున్న యువకుడు

Most Venomous Cobra: పొలం పనులకు వెళ్తుండగా కనిపించిన కింగ్ కోబ్రా.. పట్టుకున్న యువకుడు

Cobra Viral Video: కింగ్ కోబ్రా పాములు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనవి. సాధారణంగా కింగ్ కోబ్రాలు 18 నుంచి 20 అడుగుల పొడువు ఉంటాయి. ఈ పాములు నలుపు, గోధుమ రంగులను కలిగి ఉంటాయి. కొన్ని పాములు ఆకుపచ్చని రంగులో కూడా కనిపిస్తూ ఉంటాయి. మరికొన్ని పాములకు శరీరంపై చారలతో కూడిన పట్టీలు ఉంటాయి. కింగ్ కోబ్రాలు నాగుపాము ఉగ్రరూపం దాల్చినప్పుడు మరింత వెడల్పుగా మారుతాయి.

 

చిత్తడి నేలలో జీవనం..

కింగ్ కోబ్రాలు చిత్తడి నేలలతోపాటు మడ అడవుల్లో జీవనం కొనసాగిస్తాయి. సాధారంణంగా అన్ని పాముల కంటే ఎక్కువగా నీటిలో ఈదుతూ ఉంటాయి. కింగ్ కోబ్రాలు ఎక్కువగా ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. అడవుల్లో నీటి కొరత ఏర్పడితే ఆహారం గ్రామాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇండ్లలోకి వెళ్తున్నాయి. కొంతమంది ఈ పాములను చంపేస్తున్నారు. మరికొందరు స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం ఇచ్చి అడవుల్లోకి విడిచిపెడుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

 

సోషల్ మీడియాలో పోస్ట్..

స్నేక్ క్యాచర్స్ పాములు పట్టుకునే క్రమంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి పొలం పనులకు వెళ్తుతున్నాడు. ఇదే క్రమంలో కింగ్ కోబ్రా కనిపించింది. అతడు స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడి చేరుకొని పామును పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, పుట్టలోకి వెళ్లింది.

 

స్నేక్ క్యాచర్ పాము పట్టుకొని బయటికి తీశాడు. పాము అతడిని కాటు వేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో గ్రహించిన స్నేక్ క్యాచర్ దాడి నుంచి తప్పించుకుంటాడు. కొద్దిసేపు పామును అటూ ఇటూ ఆడించి ప్లాస్టిక్ డబ్బాలో బంధిస్తాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: