Published On:

King Cobra attack: కింగ్ కోబ్రా అటాక్.. జర్రుంటే సచ్చిపోతుండే పొరడు

King Cobra attack: కింగ్ కోబ్రా అటాక్.. జర్రుంటే సచ్చిపోతుండే పొరడు

King Cobra Attack on Snake Catchers: ప్రపంచంలోనే కింగ్ కోబ్రాలు చాలా విషపూరితమైనవి. వీటిని నల్లతాచు లేదా రాచనాగు అని కూడా పిలుస్తుంటారు. ఇవి సాధారణంగా 20 అడుగుల వరకు పెరుగుతాయి. ఈ కింగ్ కోబ్రా మనిషిని కాటు వేస్తే 75 శాతానికి పైగా మరణించే అవకాశం ఉంటుంది. కింగ్ కోబ్రా విషం మనిషి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎక్కువగా మెదడుపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ కింగ్ కోబ్రా దాదాపు 20 ఏళ్లు బతికి ఉంటుందని చెబుతుంటారు.

 

అయితే, గత కొంతకాలంగా కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు తెగ చూసేస్తున్నారు. ఈ కింగ్ కోబ్రాలు ఎక్కువగా అడవులకు దగ్గరగా ఉండే నివాస ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతుంటాయి. కొంతమందికి ఈ కింగ్ కోబ్రాలు కనిపించిన వెంటనే భయంతో చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొంతమంది స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం అందించి వాటిని రక్షించేందుకు తాపత్రయం పడుతుంటారు.

 

తాజాగా, ఓ అడవిలో నుంచి గ్రామంలోకి కింగ్ కోబ్రా రావడంతో ప్రజలు భయపడుతుంటారు. ఆ కింగ్ కోబ్రా ఏకంగా ఓ ఇంట్లోకి దూరింది. దీంతో స్థానికులు స్నేక్ క్యాచర్స్‌కు సమాధానం ఇవ్వగా.. అతను ఆ నల్లతాచును పట్టుకునేందుకు వస్తాడు. ఈ సమయంలో ఆ కింగ్ కోబ్రా పక్కనే ఉన్న బాత్రుంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటది. వెంటనే ఆ స్నేక్ క్యాచర్ పట్టుకొని బయటకు తీస్తాడు. ఈ సమయంలో ఆ కింగ్ కోబ్రా అమాంతం అతడిని అటాక్ చేస్తుండగా.. తృటిలో తప్పించుకుంటాడు.

 

ఆ తర్వాత ఆ కింగ్ కోబ్రాను ఓ ఆట ఆడుకుంటాడు. చివరికి దానికి ఓ సంచిలోకి నెట్టుతాడు. ఆ తర్వాత చాకచక్యంగా అందులో బంధిస్తాడు. అక్కడ ఉన్న స్థానికులు ఆశ్చర్యంగా చూస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియోను పొలిటికల్ క్రిటిక్ అనే ఎక్స్ అకౌంట్లో షేర్ చేయగా.. నెటిజన్లు తెగ చూస్తున్నారు. కొంతమంది నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్రో.. జస్ట్ మిస్.. జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

మొత్తానికి ఆ స్నేక్ క్యాచర్ ఆ కింగ్ కోబ్రాను సంచిలో పట్టుకొని అడవిలోకి వెళ్తాడు. అక్కడ సంచి ఓపెన్ చేసి వదిలేస్తాడు. అందులో నుంచి కదలకుండా ఆ కింగ్ కోబ్రా అలానే ఉంటది. దీంతో ఆ సంచి నుంచి పక్కకు అలా ఇలా కదిలించి దానిని బయటకు పంపించేస్తాడు. ఇప్పటివరకు ఈ వీడియోను వేల మంది చూశారు. మీరూ ఓ లుక్కేయండి.

 

 

ఇవి కూడా చదవండి: