Last Updated:

Kamareddy : పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Kamareddy : పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Kamareddy : పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలో నలుగురు పెద్ద చెరువులో పడి మృతిచెందారు. మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్‌గా గుర్తించారు.

ఇవాళ ఉదయం చెరువు వద్ద తల్లి మౌనిక దుస్తులు ఉతుకుతుండగా, చిన్నారులు ముగ్గురు స్నానానికి చెరువులోకి దిగారు. చెరువులో భారీ గుంత ఉండటంతో అందులో పడి మునిగిపోయారు. చిన్నారుల కాపాడేందుకు తల్లి యత్నించింది. ఈ క్రమంలోనే తల్లితో సహా పిల్లలు ముగ్గురు చెరువులో మునిగి చనిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మరో సంచలన విషయం బయట పడింది. ఐదేళ్ల క్రితం భర్త యేసు తన మొదటి భార్య శ్యామలను కొట్టి చంపాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో కేసు విచారణలో ఏమైనా లోపాలున్నాయా? ప్రస్తుతం జరిగిన ఘటనకు సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి: