Last Updated:

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు

చత్తీస్‌గడ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు గులాబీ అధినేతకు నోటీసులు జారీ చేశారు. జులై 30 వరకు ధర్మాసనాన్ని కేసీఆర్ సమయం కోరారు.

KCR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు

KCR: చత్తీస్‌గడ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై కేసీఆర్ కు జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు జారీ చేశారు. కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు గులాబీ అధినేతకు నోటీసులు జారీ చేశారు. జులై 30 వరకు ధర్మాసనాన్ని కేసీఆర్ సమయం కోరారు.

విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణ..(KCR)

తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన విద్యుత్ కాంట్రాక్టుల లోటును తీర్చాలని ఆదేశించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసు జారీ చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లోని వివరాలను తెలియజేయాలని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది. విద్యుత్ కమిషన్ నోటీసుల ప్రకారం జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కోరింది.అయితే సమాధానం ఇచ్చేందుకు జూలై 30 వరకు సమయం కావాలని కేసీఆర్ కోరారు.మూడు అంశాలపై విచారణ కొనసాగుతుదని విద్యుత్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారు. ఛత్తీస్ ఘడ్, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ పై విచారణ కొనసాగుతుందని చెప్పారు. టెండర్ల ప్రక్రియ లేకుండా ఒప్పందాలు జరిగాయన్నారు. 25 మందికి నోటీసులు ఇచ్చామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇంకా సమాధానం ఇవ్వలేదని, టైం అడిగారని నరసింహారెడ్డి వివరించారు.

 

ఇవి కూడా చదవండి: