Published On:

BRS Party: గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మీటింగ్‌లతో మాజీ సీఎం కేసీఆర్ బిజీబిజీ

BRS Party: గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహం.. మీటింగ్‌లతో మాజీ సీఎం కేసీఆర్ బిజీబిజీ

KCR Met BRS Leaders: బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కసరత్తు మొదలు పెట్టింది. ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ లో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్ లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని శ్రేణులకు అధినేత కేసీఆర్ సూచిస్తున్నారు. హస్తం పార్టీని తుం చేద్దాం.. గులాబీ పార్టీ సత్తా చాటు దామని కారు పార్టీ శ్రేణుల కు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతుండటం గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది

భారత రాష్ట్ర సమితి సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి జిలిల్లాల వారీగా పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ ఎస్ నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గులాబీ నాయకులతో మాజీ సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారంట.

ప్రజలు ఏం కోరుకుంటున్నారు..? కాంగ్రెస్ పాలన.. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఎం చర్చించుకుంటున్నారు…? స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి..? తదితర అంశాలపై బీఆర్ఎస్ నాయకులను మాజీ సీఎం కేసీఆర్ ఆరా తీశారంట. స్వరాష్ట్రం సాధనే ధ్యేయంగా పురుడు పోసుకున్న గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లి వేడుకలు జయప్రదం చేయాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని ఒక్కొక్క నియోజక వర్గం నుంచి లక్ష మంది తరలించేలా కారు పార్టీ శ్రేణులు ప్రణాళికలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేశారంట. ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జయప్రదం చేయాలని శ్రేణులకు అధినేత కేసీఆర్ సూచించారంటున్నారు

నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరుపుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. నియోజకవర్గానికి లక్ష మందికి తగ్గకుండా సభకు తరలి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. మహాసభ ప్రజలకు మనోధైర్యం వచ్చేలా ఉండాలని.. మహా సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని పార్టీ నేతలకు సూచనలు చేశారంట. ఇప్పటికే వివిధ ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీ అవుతున్న గులాబీ బాస్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం తెలంగాణ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని.. ప్రజలు స్వచ్ఛందంగా బహిరంగ సభకు తరలివస్తారని ఆ పార్టీ నేతలు ధీమాతో కనిపిస్తున్నారు.

కారు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకొని పార్టీ శ్రేణులకు అధినేత మాజీ సీఎం కేసీఆర్ దిశానిర్దేశం తో గులాబీ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఉద్యమాల పురిటి గడ్డ నుంచి భారీ స్థాయిలో జన సమీకరణే ధ్యేయంగా పార్టీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఏడాదిన్నర తరువాత అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కలిగించడమే ధ్యేయంగా కారు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సన్నద్ధం అవడం గులాబీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపుతోందంటున్నారు.