Published On:

KCR : హైద‌రాబాద్, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాల నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

KCR : హైద‌రాబాద్, ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాల నేత‌ల‌తో కేసీఆర్ స‌మావేశం

KCR : బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సందర్భంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించే మ‌హాస‌భ గురించి నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. జ‌న స‌మీక‌ర‌ణ‌తోపాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ నేప‌థ్యంలో రోజుకు రెండు ఉమ్మ‌డి జిల్లాల నేత‌ల‌తో కేసీఆర్ స‌న్నాహ‌క స‌మావేశాలు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

 

 

శుక్రవారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, న‌వీన్, వాణిదేవి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద‌, మాధ‌వ‌రం కృష్ణారావు, ప‌ద్మారావు, మాగంటి గోపీనాథ్, బండారి ల‌క్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ముఠా గోపాల్, మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, కాలేరు వెంక‌టేశ్‌, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, మెతుకు ఆనంద్, మంచిరెడ్డి కిష‌న్‌రెడ్డి, పైల‌ట్ రోహిత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డి, మ‌న్నె గోవ‌ర్ధ‌న్, ముఠా జైసింహ, మాజీ చైర్మ‌న్ క్రిశాంక్ మ‌న్నె తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: