Published On:

KCR : 10 ల‌క్ష‌ల మందితో ర‌జ‌తోత్స‌వ‌ మ‌హాస‌భ‌ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR : 10 ల‌క్ష‌ల మందితో ర‌జ‌తోత్స‌వ‌ మ‌హాస‌భ‌ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR : ఈ నెల 27న క‌నీవినీ ఎరుగ‌ని విధంగా ర‌జ‌తోత్స‌వ‌ మ‌హా స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఇవాళ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ముఖ్య నాయ‌కుల‌తో స‌మావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా స‌భ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి వారితో మాట్లాడారు. సభకు 10 ల‌క్ష‌ల మంది త‌ర‌లిరానున్న నేపథ్యంలో స‌భ‌ను విజ‌యవంతం చేసేందుకు అవ‌స‌ర‌మైన‌ స‌ల‌హాలు, సూచ‌నలు చేశారు. ఎండాకాలం దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాల‌ని ఆదేశించారు. 10 ల‌క్ష‌ల మ‌జ్జిగ ప్యాకెట్లు, 10 ల‌క్ష‌ల నీళ్ల బాటిళ్లు అందుబాటులో ఉంచాల‌ని నాయ‌కుల‌కు సూచించారు. స‌మావేశంలో కేటీఆర్‌, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా బీఆర్ఎస్ నేత‌లు మ‌ధుసుద‌నాచారి, పెద్దిరెడ్డి సుద‌ర్శ‌న్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

 

 

154 ఎకరాల్లో స‌భా ప్రాంగ‌ణం..
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను కలిపే జాతీయ ర‌హ‌దారి 563, 763కు జంక్ష‌న్‌గా ఉండే ఎల్క‌తుర్తిని స‌భా కేంద్రంగా కేసీఆర్ ఎంచుకున్నారు. కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేర‌కు 1,213 ఎక‌రాలను చ‌దును చేశారు. 154 ఎక‌రాల్లో ర‌జ‌తోత్స‌వ‌ మ‌హాస‌భ ప్రాంగ‌ణం ఉండ‌నుంది. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించ‌నున్నారు. 50 వేల వాహ‌నాలను నిలిపేందుకు వీలుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయ‌నున్నారు.

 

 

 

వరంగల్ సెంటిమెంట్..
తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్‌గా ఉంటున్న వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభను లక్షలాది మందితో ఈ నెల 27న నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎలుకతుర్తిలో సభా స్థలాన్ని ప‌లువురు నాయ‌కులు పరిశీలించారు. స‌భా వేదిక కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను కేసీఆర్ ఎండ‌గ‌ట్ట‌నున్నారు. తెలంగాణ న‌లుమూల‌ల నుంచి త‌రలిరానున్న‌ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొండంత ఆత్మ‌విశ్వాసం నింప‌నున్నారు గులాబీ అధినేత.

ఇవి కూడా చదవండి: