Published On:

AP Rajya Sabha : రాజ్యసభ అభ్యర్థి ఖరారు.. సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణకు అవకాశమిచ్చిన బీజేపీ

AP Rajya Sabha : రాజ్యసభ అభ్యర్థి ఖరారు.. సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణకు అవకాశమిచ్చిన బీజేపీ

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన రాజ్యపభ స్థానం భర్తీపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అనూహ్యంగా పార్టీ సీనియర్ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్‌ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి తరఫున అభ్యర్థిని ప్రకటించారు. మరోవైపు ఈ స్థానం నుంచి ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తమిళనాడుకు చెందిన అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరును పరిశీలించినట్లు ప్రచారం జరిగింది. ఈ స్థానం రాజ్యసభ సభ్యుడికి మరో రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉంది.

 

మే 9న పోలింగ్‌..
మే 9న పోలింగ్‌ జరగనుంది. మంగళవారం సాయంత్రం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న పరిశీలన, మే 2న ఉపసంహరణ తుది గడువు. మే 9న పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. మే 13తో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కాగా, విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది.

 

 

ఇవి కూడా చదవండి: