Published On:

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం

Simhachalam: విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహలక్ష్మీ నరసింహాస్వామి వారిని హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం చేశారు.

 

హోంమంత్రికి స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత.. అధికారులకు పలు సూచనలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐదుగురు మంత్రుల బృందం చందనోత్సవం ఏర్పాట్లపై సమీక్షించడం జరిగిందన్నారు హోంమంత్రి అనిత.

 

ఏప్రిల్ 30న భక్తులందరికీ స్వామివారి నిజరూపదర్శనం కలిగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు అనిత. జిల్లా కలెక్టర్ ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రతా బాగ్చీతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఉదయం ఆరు గంటల లోపల అంతరాలయ దర్శనాలు ముగుస్తాయని చెప్పారు.