Pakistan: భయం గుప్పెట్లో పాక్.. దేశం వదిలి పారిపోతున్న ఆర్మీ అధికారుల కుటుంబాలు

Pakistan: భారత్ ధాటికి పాక్ వణికిపోతోంది. బయటకు మేకపోతు గాంభీర్యం కనపరుస్తున్నా లోపల బిక్కచచ్చిపోతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కుటుంబంతో సహా ఆర్మీ అధికారుల కుటుంబాలను విదేశాలకు తరలించారు. దీంతో భారత్‌ను ఎదుర్కొనే సత్తా పాక్‌కు లేదని తెలుస్తోంది. 2019లో పుల్వామా ఘటనలోనూ మునీర్‌కు సంబంధం ఉంది. పుల్వామా సమయంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు.
పహల్గామ్ ఘటన వెనుక మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలే కారణంగా ప్రపంచ దేశాధినేతలు అభిప్రాయపడుతున్నారు. మీటింగ్‌లో మాట్లడిన ఆయన భవిష్యత్తులో కశ్మీర్ తమ జీవనాడిగా ఉంటుందన్నారు. హిందువుల కంటే ముస్లింలు అన్ని విషయాలలో భిన్నం అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది బలికాగా పలువురు గాయపడ్డారు. ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ కఠిన చర్యలకు పూనుకుంది. దౌత్యపరంగా కఠిన నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ పౌరుల వీసాలు రద్దు చేసింది.
దాయాది చేసిన దుస్సాహసానికి, దురాగతానికి భారీ మూల్యం తప్పదన్న విషయం తెలుసు. అందుకే పాకిస్థాన్ వెన్నులో వణుకు మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణాలను లెక్కబెడుతున్న పాక్ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడుపుతోంది. భారత్ ప్రతీకారచర్యను తట్టుకునే దమ్ము ఏమేరకు ఉందని లోలోపల బేరీజులు వేసుకునే పనిలో పడింది.
భారత్ భూభాగంలో నెత్తురును పారించే ముందు విచక్షణ కోల్పోయి మృగంలా వ్యవహరించిన పాక్ ఇప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి దార్లు వెతుక్కుంటోంది. ఆ దేశ ఆర్మీ ఛీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కుటుంబంతోపాటు చాలా మంది ఆర్మీ అధికారులు తమ కుటుంబాలను విదేశాలకు పంపించేశారు. భారత్ ఎటాక్ చేస్తుందని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది భారత్.. పాక్ గుండెల్లో ఎలాంటి భయాన్ని నెలకొల్పిందనడానికి నిదర్శం.