Last Updated:

Janasena Party : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి ( జూన్ 26, 2023 ) పర్యటన వివరాలు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర భారీ జనసందోహం మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ క్రమంలో నేడు తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రకటించింది. 

Janasena Party : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి ( జూన్ 26, 2023 ) పర్యటన వివరాలు..

Janasena Party : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర భారీ జనసందోహం మధ్య దిగ్విజయంగా సాగుతుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యాత్ర కొనసాగుతుండగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. ఈ క్రమంలో నేడు తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ (Janasena Party) ప్రకటించింది.

కాగా ఈ పర్యటనలో భాగంగా ముందుగా ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్ నరసాపురం నియోజకవర్గ ముఖ్య నాయకులతో.. సమావేశం అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.

 

కాగా ఆదివారం నాడు రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన పవన్.. మలికిపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికార వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మము అని.. మీ ఇసుక దోపిని, మీ దౌర్జన్యాన్ని ఎదురుకోకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు అంటూ సవాల్ విసిరారు. మీరంతా ఫ్యాక్షనిస్టులు అంటూ వైసీపీ పెద్దలను ఏకిపారేశారు. వారు చేసే అన్యాయాలకు అక్రమాలకు అడ్డుకట్టులు పడే రోజులు వచ్చాయన్నారు.

2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కత్తితో గుండెను కోసినట్టు అనిపించిందని తెలిపారు. ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు గెలుపోటములు ఉంటాయని తెలుసని, అలాంటి సమయంలో రాజోలులో ప్రజలు ఇచ్చిన గెలుపుతో సేదదీరినట్టు అనిపించిందని అన్నారు. రాజోలు ప్రజలు అందించిన విజయం ఎడారిలో ఒయాసిస్ లాంటిదని పవన్ కళ్యాణ్ అన్నారు. దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇక్కడి ప్రజలు ఒక ఆశ కల్పించారని ఆయన పేర్కొన్నారు. 150 మందితో ప్రారంభమైన జనసేన ఒక్క రాజోలులోనే 10,274 మంది క్రియాశీలక సభ్యుల స్థాయికి ఎదిగిందని ఆయన వివరించారు. అంతేకాకుండా రాజోలు ఎమ్మెల్యేపై ఘాటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ “ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఒక పార్టీ గుర్తుపై గెలుస్తాడు. ఆ తర్వాత పార్టీ మారతాడు. ఆ వ్యక్తి ప్రజల ఓటు అనే బోటుపై గెలిచాడు.. కానీ అందరి ఓట్లతో గెలిచిన ఆ వ్యక్తి తన వ్యక్తిగత నిర్ణయాలతో పార్టీ మారడం తప్పు.. అది ఏ ఎమ్మెల్యే అయినా సరే!” అని వివరించారు.