Last Updated:

Ravulapalem Gun Firing: రావులపాలెంలో కాల్పుల కలకలం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్ధరాత్రి కాల్పుల మోత మోగింది. గ్రామంలో రవాణా శాఖ ఆఫీస్ ఎదుట ఫైనాన్స్ వ్యాపారి ఆదిత్మ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ఎవరో చొరబడడంతో ఆదిత్య వారిని నిలదీశాడు.

Ravulapalem Gun Firing: రావులపాలెంలో కాల్పుల కలకలం

Ravulapalem: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అర్ధరాత్రి కాల్పుల మోత మోగింది. గ్రామంలో రవాణా శాఖ ఆఫీస్ ఎదుట ఫైనాన్స్ వ్యాపారి ఆదిత్మ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి ఎవరో చొరబడడంతో ఆదిత్య వారిని నిలదీశాడు. దీంతో దుండగులు ఆదిత్య పై కాల్పులు జరిపారు. ఘటనలో తుపాకీలోని మ్యాగజైన కింద పడిపోయింది. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదిత్య రెడ్డి తండ్రి ఇటీవల మరణించాడు. అతనికి ఫైనాన్స్ వ్యాపారంలో ఎవరితోనయినా గొడవలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వ్యాపార లావాదేవీలకు సంబంధించి అంబాజీపేట నాగేశ్వరావు, వెంకటేశ్వర్లు సుఫారీ గ్యాంగ్ ద్వారా కాల్పులు జరిపారని బాధితులు అనుమానిస్తున్నారు. సుఫారీ గ్యాంగ్ గన్ మ్యాగజైన్‌తో పాటు, నాటు బాంబులు తీసుకు వచ్చారని, బాధితులు పోలీసులకు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు మొదలు పెట్టారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

follow us

సంబంధిత వార్తలు