Dhanashree Verma: మొన్ననే విడాకులు – ఇప్పుడు సినిమాలో ఐటెం సాంగ్, నటుడితో ధనశ్రీ హాట్ స్టెప్పులు

Dhanashree Verma Acted in Bhool chuk Maaf Song: ధనశ్రీ వర్మ.. ప్రత్యేకంగా పరిచయం అసవరం లేని పేరు. యూట్యూబర్, డ్యాన్సరైన ఈమె ప్రముఖ క్రికెటర్‌తో విడాకులతో వార్తల్లో నిలిచింది. టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య అయిన ధనశ్రీ త్వరలోనే సినీరంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూనే.. హిందీలో ఐటెం సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగులో ‘ఆకాశం దాటివస్తావా’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.
మరోవైపు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ కుమార్ రావు, వామికా గబ్బీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘భూల్ చుక్ మాఫ్’ సినిమాలో ధనశ్రీ ఓ ఐటెం సాంగ్‌లో నటిస్తుంది. ఇటీవల ఈ పాట కూడా రిలీజైంది. ఇందులో తనదైన స్టెప్పులు, గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. ఇక మే 9న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసి ప్రమోషన్స్ చేస్తోంది. దీంతో ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విడాకులు అయ్యి నెల రోజులు కూడా కాలేదు.. ధనశ్రీ అప్పుడే తన కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. చేతికి వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటూ నటిగా సెటిలైపోవడానికి సిద్ధమైంది.
ఇక ఆమె సినిమాలు సక్సెస్ అయితే మాత్రం త్వరలోనే ఇండస్ట్రీలో వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరిన ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది. కాగా ధనశ్రీ వర్మ, క్రికెట్ యజ్వేంద్ర చాహలు 2020లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఆనోన్యంగా ఉన్న వీరు వైవాహిక బంధంలో మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో కొంతకాలం విడివిడిగా జీవించిన ధనశ్రీ, చాహల్‌లు గత నెల విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌లో డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లిన చాహల్‌కు ధనశ్రీతో అక్కడ పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా 2020 లాక్‌డౌన్ పెళ్లి జరగ్గా.. ఐదేళ్లకే వీరు విడాకులు తీసుకుని విడిపోయారు.
View this post on Instagram