AP High Court: అయ్యన్న పై సీఐడీ దర్యాప్తు కొనసాగించొచ్చు.. హైకోర్టు
తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై నమోదైన భూఆక్రమణ కేసు కొట్టివేయాలని దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
Amaravati: అర్ధరాత్రి హడావుడి చేసి ప్రతిపక్ష నేతలను పోలీసు స్టేషన్లకు, సీఐడి కార్యాలయాలకు తరలించే ఏపి ప్రభుత్వం మరోమారు హైకోర్టులో బోర్లాపడింది. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి పై నమోదైన భూఆక్రమణ కేసు కొట్టివేయాలని దాఖలైన పిటిషన్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆయ్యన్న పై నమోదు చేసిన 467 సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది. 41ఏ నిబంధనలు అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఎన్‌ఓసీ విలువ ఆధారిత సెక్యూరిటీ కిందకు రాదని తెలిపింది. అయ్యన్న పాత్రుడి పై సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని న్యాయస్థానం చెప్పింది.
0.16 సెంట్ల జలవనరుల శాఖ భూమిని ఆక్రమించారని అయ్యన్న పై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కేసులో హడావుడికి మాత్రమే సీఐడి అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. అంతేగాని కేసు పై ఎలాంటి సెక్షన్లు నమోదు చేయాలి అన్న అంశంలో ఏపీ ప్రభుత్వానికి సరైన అవగాహన లేకుండా ఉన్నట్లు పదే పదే కోర్టు సూచనలతో తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Ayyanna Pathrudu: రుషికొండను చూడండి ఎలా తవ్వేసారో.. మోదీకి లేఖ వ్రాసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు