Last Updated:

Nizamabad: నిజామాబాద్ లో మంత్రి X ఎంపీ

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ ఎంపీగా గెలిచినా కల్వకుంట్ల కవిత పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శలు వినిపించాయి.పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ఇచ్చి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు ధర్మపురి అరవింద్. పసుపు రైతులకు స్పైస్ బోర్డు ఏర్పాటు చేసిన అరవింద్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్‌ఎస్‌ సరికొత్త వ్యూహానికి తెరతీసింది. రైతులను ఎంపీపైకి ఉసిగొల్పడంతో దాడుల వరకు వెళ్లింది రాజకీయం.

Nizamabad: నిజామాబాద్ లో మంత్రి X ఎంపీ

Nizamabad: ఆ జిల్లాలో మంత్రి వర్సెస్ ఎంపీ మధ్య రాజకీయ దుమారం చెలరేగుతుంది. ఇద్దరి స్వగ్రామం ఒక్కటే. పార్టీలు వేరైనా ఇద్దరి రాజకీయ నేపథ్యం ఒక్కటే. ఇద్దరు తండ్రి చాటు బిడ్డలుగా రాజకీయ ఆరంగేట్రం చేసిన వారే. అయినా ఇద్దరి మధ్య రాజకీయ రగడ మొదలైంది. అసలు ఎందుకు ఈ చిచ్చు మొదలైంది. మంత్రి, ఎంపీ రాజకీయవైరంపై ప్రైమ్9 న్యూస్ స్పెషల్‌ స్టోరీ.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ ఎంపీగా గెలిచినా కల్వకుంట్ల కవిత పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శలు వినిపించాయి.పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ఇచ్చి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు ధర్మపురి అరవింద్. పసుపు రైతులకు స్పైస్ బోర్డు ఏర్పాటు చేసిన అరవింద్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్‌ఎస్‌ సరికొత్త వ్యూహానికి తెరతీసింది. రైతులను ఎంపీపైకి ఉసిగొల్పడంతో దాడుల వరకు వెళ్లింది రాజకీయం.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఎంపీ అరవింద్‌ పర్యటనను, అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పలుసార్లు అడ్డుకున్నారు. పరిస్థితి పరస్పరం దాడుల వరకూ వెళ్లింది. దీంతో జిల్లాలో రాజకీయ దుమారం మొదలైంది. టీఆర్‌ఎస్‌ వరుస దాడులతో అరవింద్‌ దూకుడు పెంచారు. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ప్రశాంత్‌రెడ్డి వర్సెస్ ఎంపీ మధ్య మాటల తూటాల్లా పేలుతున్నాయి. బాల్కొండలో నియోజకవర్గంలోని వేల్పూరలో ఇటీవల రైతు ధర్నా చేపట్టింది బీజేపీ. చెక్ డ్యామ్‌లన్నీ కేంద్రం నిధులతో నిర్మించారని ఎంపీ అరవింద్‌ చెప్పారు. దాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఖండించారు. రైతులు లేని ధర్నా చేశారని, చెక్ డ్యామ్‌లపై ఎంపీ అబద్ధాలు మాట్లాడారని మంత్రి విమర్శించారు. కాగా ఈ ఇద్దరు నేతల స్వగ్రామం వేల్పూర్ కావడం విశేషం.

బీజేపీ ధర్నా చేస్తే మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారని, పసుపు రైతులకు మంత్రి ఏం చేశారో చెప్పాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు.తాను ఎంపీగా ఎన్నికైన 5 నెలల్లోనే పసుపు సమస్యల పరిష్కారానికి కేంద్రాన్ని ఒప్పించానని, స్పైసెస్ బోర్డు ఎక్స్టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసి, 30 కోట్ల రూపాయల నిధులు తెచ్చానని తెలిపారు. పసుపు పంటకు గతంలో కంటే ఎక్కువగానే మద్దతు ధర ఇచ్చామని అన్నారు. రైతుబంధు ఇచ్చి సబ్సిడీలను ఎగ్గొట్టిన ఘనత టీఆర్ఎస్‌‌కే దక్కుతుందని అరవింద్ ఎద్దేవా చేశారు. కేంద్రం అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాసి.. ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. ఒక కోటి 40 లక్షల టన్నుల తెలంగాణ వడ్లు కేంద్రం కొనుగోలు చేసిందని అరవింద్ చెప్పారు.

అయితే – చెక్‌ డ్యామ్‌ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నయాపైసా రాలేదన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి . రైతు ధర్నా పేరుతో రైతులు లేని ధర్నా నిర్వహించి బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యామ్‌లపై ఎంపీ అరవింద్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణ నిధులపై ఆధారాలన్నీ బాల్కొండ నియోజకవర్గ ప్రజల ముందుంచారు. 10 చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి 66 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని వెల్లడించారు. అందులో 20 కోట్లు నాబార్డు ద్వారా రుణం తెచ్చామని, అది కూడా వడ్డీతో సహా నాబార్డుకు కేసిఆర్ ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. మిగతా 46 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని మంత్రి ప్రకటించారు. మంజూరైన మొత్తం 27 చెక్ డ్యాములకు 177 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా అందులో 20 కోట్లు మాత్రమే నాబార్డు రుణం అని, మిగతా 157 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానివే అని మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరించారు.

నిజామాబాద్ నుంచి పసుపుని విదేశాలకు ఎగుమతి చేశామని, వ్యవసాయంలో జిల్లా రాష్ట్రానికే ఆదర్శమన్నారు ఎంపీ అరవింద్‌. అలాంటి నిజామాబాద్ జిల్లా ప్రజలను మోసం చేసిన టిఆర్ఎస్ పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. దీనికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి తనదైన శైలిలో కౌంటర్స్‌ ఇచ్చారు. దీంతో రాజకీయం హీటెక్కింది. మంత్రి వర్సెస్‌ ఎంపీ రాజకీయ దుమారానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ పడుతుందో అని వేల్పూరు వాసులు ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి: