Home / Telangana News
మాజీ ఎంపీ , బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారడం గురించి 3, 4 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు. ఖమ్మం జిల్లా ముఖ్యనేతలతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు.
బీఆర్ఎస్ కి చెందిన బెల్లంపలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్ ఫిర్యాదు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ వ్యవహారంలో బాధితురాలు రసిన ఫిర్యాదుకు మహిళా కమిషన్ స్పందించింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణలో దశాబ్ది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తోంది. జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి 20 రోజుల పాటు పలు కార్యక్రమాలకు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది.
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో ఆవర్తనం కొనసాగుతుందని, ఇది దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ స్థిరంగా ఉన్నట్టు వాతారణ శాఖ స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ ఎంపీ, హెటిరో ఛైర్మన్ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపును రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సింధు ఫౌండేషన్ కు మేనేజింగ్ ట్రస్టీగా పార్థసారథి రెడ్డి వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అధికారులకు వరుసగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనుంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిలా పార్టీలు మారడం తనకు చేతకాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన అవతరణ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా రాజ్ భవన్ లో కేక్ కట్ చేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి తమిళసై ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్ఆర్ తెలంటాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణను లిక్కర్ రాష్ట్రంగా మార్చారని షర్మిల విమర్శించారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఏఈ సివిల్ మాస్టర్ పేపర్ పెద్ద ఎత్తున చేతులు మారినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కీలక నిందితులు రవికిషోర్ అరెస్టుతో నిందితుల వివరాలు బయటకు వస్తున్నాయి. వరంగల్ విద్యుత్ శాఖ డీఈతో పాటు మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.