Pakistan: లాహోర్‌లో భారీ పేలుళ్లు, ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్థాన్!

Pakistan: పాకిస్తాన్‌లో మూడు చోట్ల పేలుళ్లు సంభవించాయి. లాహోర్‌లో భారీ పేలుళ్లతో అక్కడి ప్రజలు, ప్రభుత్వం భయాందోళనలకు గురవుతున్నారు. వాల్టన్ ఏరియాలోని పాక్ మిలటరీ ఎయిర్ పోర్ట్‌లో భారీ శబ్దంతో పేలుళ్లు జరిగాయి. దీంతో పాకిస్తాన్ సహాయక చర్యలను ప్రారంభించింది. అయితే ఈ పేలుళ్లకు ఎవరు పాల్పడ్డారనన్న దానిపై ఇంకా ఎవరూ దృవీకరించలేదు.
లాహోర్‌లో వరుస పేలుళ్ల నేపథ్యంలో లాహోర్ ఎయిర్‌పోర్ట్ మూసివేశారు. ఈ పేలుళ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ధృవీకరించింది. ఇస్లామాబాద్, లాహోర్‌లలో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించి వైద్యులకు సెలవులు రద్దు చేశారు. వరుస పేలుళ్లతో లాహోర్, ఇస్లామాబాద్ భయంతో వణికిపోతుంది.
ఇదిలా ఉంటే… భారత్..మరో దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరో 12 ఉగ్రవాద స్థావరాలు టార్గెట్‌గా భారత్ వ్యూహరచన చేస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం సమూలంగా రూపుమాపే యోచనలో భారత్ కనిపిస్తోంది. పాకిస్తాన్, పీవోకెలో 21 ఉగ్ర స్థావరాలను గుర్తించారు. ఆపరేషన్ సిందూర్‌లో 9 స్థావరాలను భారత్ నేలమట్టం చేసింది. మిగిలిన 12 స్థావరాలే టార్గెట్‌గా ప్లానింగ్ చేస్తోంది. భారత్ భవిష్యత్ దాడులపై పాకిస్తాన్ వణికిపోతోంది.