Indian Navy: భారత నౌకాదళానికి సరికొత్త పతాకం
భారత నౌకాదళానికి సరికొత్త పతాకం లభించనుంది. బ్రిటిష్ కాలం నాటి గుర్తులతో ఉన్న ప్రస్తుత పతాకాన్ని త్వరలో మార్చనున్నారు. భారత్‌లోనే పూర్తిగా తయారైన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఈ సరికొత్త పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.
New Delhi: భారత నౌకాదళానికి సరికొత్త పతాకం లభించనుంది. బ్రిటిష్ కాలం నాటి గుర్తులతో ఉన్న ప్రస్తుత పతాకాన్ని త్వరలో మార్చనున్నారు. భారత్‌లోనే పూర్తిగా తయారైన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై ఈ సరికొత్త పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పతాకం పై సెయింట్ జార్జి క్రాస్ ఉంది. స్వాతంత్ర్యం రాకముందు దాదాపు 90 ఏళ్లపాటు బ్రిటిష్ పాలకులపై ఆధారపడిన విషయానికి గుర్తుగా ఇది నిలుస్తోందన్న వాదనలున్నాయి.
పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నౌకాదళ విధుల్లోకి చేర్చనున్నారు. అదే సమయంలో ప్రధాని భారత నౌకాదళానికి సరికొత్త చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు. 1928 నుంచి సెయింట్ జార్జ్ క్రాస్ భారత నౌకాదళ చిహ్నంగా ఉంది. 2001-04 మధ్యలో వాజ్‌పేయి ప్రభుత్వం దీనిని తొలగించింది. ఆ స్థానంలో నీలం రంగు ఇండియన్ నేవీ క్రెస్ట్‌ను చేర్చింది.
ఆ తర్వాత నీలం రంగు క్రెస్ట్ సముద్రంలో ఉన్నప్పుడు తొందరగా గుర్తించడం కష్టమవుతోందని నౌకాదళ అధికారులు ఫిర్యాదులు చేశారు. దీంతో మళ్లీ సెయింట్ జార్జ్ క్రాస్‌ను పతాకంలోకి చేర్చారు. కాకపోతే దీని మధ్యలో నాలుగు సింహాల గుర్తును వేశారు. 2014లో వీటి కింద ‘సత్యమేవ జయతే’ అనే పదాలను చేర్చారు.