Published On:

Shani Gochar In July 2025 : శని తిరోగమన సంచారం.. 3 రాశుల వాళ్లు కుబేరులయ్యే ఛాన్స్

Shani Gochar In July 2025 : శని తిరోగమన సంచారం.. 3 రాశుల వాళ్లు కుబేరులయ్యే ఛాన్స్

Shani Gochar In July 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని ప్రస్తుతం ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్నాడు. ఇక్కడే అక్టోబర్ 3, వరకు ఉండబోతున్నారు. శని ఈ నక్షత్ర మార్పు దేవగురు బృహస్పతి రాశి అయిన మీన రాశిలో జరిగింది.  శని తిరోగమనంలో జూలై 13 ఆదివారం ఉదయం 9:36 గంటలకు సంచరించనున్నాడు. 28 నవంబర్ 2025న ఉదయం 9:20 గంటల వరకు శని తిరోగమన స్థితిలో ఉంటాడు. దీని తర్వాత ప్రత్యక్షంగా మారుతాడు. శని ఈ మార్పులు 3 రాశుల వారికి మేలు కలిగిస్తాయి. అంతే కాకుండా మిగతా రాశులపై కూడా ప్రభావం కలిగిస్తాయి. మరి శని సంచారం ఏ రాశుల వారికి మేలు కలిగిస్తుందో ? ఏ ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందామా..

కర్కాటక రాశి: శని యొక్క తిరోగమన గమనం , నక్షత్ర మార్పు కర్కాటక రాశి వారి జీవితాలలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న విభేదాలు కూడా ముగుస్తాయి. ప్రేమ జీవితంలో ఆనందం పెరుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. అంతే కాకుండా ఉన్నతాధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించండి. అంతే కాకుండా మీరు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం ఇది.

మీన రాశి: మీన రాశి వారికి శని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే మీన రాశి వారి జీవితాల్లో మంచి రోజులు ప్రారంభమవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వివాహితులు తమ పిల్లల నుండి శుభవార్త వింటారు. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. అంతే కాకుండా వ్యాపారంలో కూడా మీకు లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చు.

కుంభ రాశి: శని గ్రహం యొక్క తిరోగమన సంచారం నక్షత్రాల సంచారం రెండూ కుంభ రాశిపై శుభ ప్రభావాలను చూపుతాయి. అంతే కాకుండా ఇప్పటివరకు కొనసాగుతున్న డబ్బు కొరత త్వరలోనే పరిష్కారమవుతుంది. కొత్త వాహనం లేదా ఇల్లు కొనడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. అంతే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు మీ భాగస్వామితో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. అంతే కాకుండా ఉన్నతాధికారులు మీకు కొత్త ప్రాజెక్టులను అప్పగిస్తాయి. మునుపటి కంటే మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది.