Published On:

Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. బయటకు రావొద్దని హెచ్చరికలు!

Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. బయటకు రావొద్దని హెచ్చరికలు!

Heavy Rain Alert in Telangana: తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ  ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ , నల్గొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది.

 

మరోవైపు హైదరాబాద్, గద్వాల్, కామారెడ్డి, మేడ్చల్, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లోనూ వానలు పడనున్నట్లు తెలిపింది. కాగా, తెల్లవారుజాము నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడి వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కావున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

 

కాగా, రాష్ట్రంలో ఉదయాన్నే వర్షం మొదలైంది. హైదరాబాద్‌తో పాటు కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఈ మేరకు ఉప్పల్, రామంతాపూర్, తార్నాక, బంజారాహిల్స్, జూబిహిల్స్, మెహిదీపట్నం, అత్తాపూర్, ఫలక్ నుమా, సికింద్రాబాద్, అల్వాల్, చింతల్, ఓల్డ్ సిటీ తదితర ప్రాంతాల్లో చినుకులు పడుతున్నాయి. అంతేకాకుండా ఉదయం నుంచే మేఘాలు నగరవ్యాప్తంగా కమ్ముకున్నాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 

ఇదిలా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో రాత్రి అనేక జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురవగా. . పలు ప్రాంతాలో ఇళ్లల్లోకి నీళ్లు చేరాయి. వెంటనే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి కాలనీ, పంచాయతీ, ప్రజాశక్తి నగర్, రాప్తారు మండలంలోని కందుకూర గ్రామ సమీపంలో ఉన్న సీపీఐ కాలనీలోకి నీళ్లు చేరడంతో మునిగిపోయాయి. ఏపీలో కడపలో కూడా భారీ వర్షం కురిసింది.

 

అలాగే హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీ, మణికొండ, గోల్కొండ, అత్తాపూర్, మెహిదీపట్నం, గోషామహల్, లంగర్ హౌస్, రాజేంద్రనగర్‌లో భారీ వర్షం కురిసింది. ఇక, శంషాబాద్, వికారాబాద్ ప్రాంతాల్లో వర్షం ముంచెత్తింది.