Home / explosion
Explosion In Crackers Factory: తమిళనాడులో భారీ పేలుడు జరిగింది. శివకాశిలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో ఇవాళ భారీగా పేలుళ్లు జరిగి ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. బాణసంచా కర్మాగారంలో మందుగుండు సామాగ్రి కలుపుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందని […]
Punjab: పంజాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమైనట్టు సమాచారం. శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలోని సింఘవాలి- కోట్లీ రహదారిపై ఉన్న రెండస్తుల బిల్డింగ్ లో బాణసంచా తయారీ, ప్యాకేజింగ్ యూనిట్ లో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనలో ఐదుగురు వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. కాగా పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద పలువురు కార్మికులు […]
Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ పేలుళ్లు కలకలం రేపాయి. మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ కంపెనీలో ఇవాళ పేలుడు జరిగింది. ప్రమాదంలో 9 మంది కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మరణించగా.. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి భవనం పూర్తిగా నేలమట్టమైంది. కాగా ప్రమాదానికి గురైన వారిని పోలీసులు గుర్తించారు. వారిలో చాడ గ్రామానికి చెందిన రాజబోయిన […]