Last Updated:

Earthquake: మయన్మార్​లో మరోసారి భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య!

Earthquake: మయన్మార్​లో మరోసారి భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య!

Earthquake Again in Myanmar: మయన్మార్​లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రతకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇండియా కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

 

అయితే బర్మా నగరానికి సమీపంలోని నేపై టావ్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా.. హూమికి దాదాపు 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉండడంతో భారీ ప్రమాదం నుంచి బయట పడినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే మయన్మార్‌లో అర్దరాత్రి తర్వాత 4.3 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, మయన్మార్ నగరంలో భూకంపం రావడంతో వేల మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ రెండు దేశాల్లో కలిపి 1000కిపైగా చనిపోగా.. 2,370 మందికి పైగా గాయపడ్డారు. ఈ భూకంప తీవ్రతకు పలు భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అమెరికా ఏజెన్సీ హెచ్చరికలు చేయడం గమనార్హం.