Turkey : టర్కీలో భారీ భూకంపం.. స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదు

Earthquake in Turkey : టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ ప్రధాన నగరం ఇస్తాంబుల్‌లో తీవ్ర ప్రకంపనలు వచ్చాయని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఇస్తాంబుల్‌కు నైరుతి దిశలో 40 కిలోమీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
ప్రస్తుతం ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియరాలేదని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. భూకంపం ధాటికి బల్గేరియా, గ్రీస్, రొమేనియా దేశాల్లో ప్రకంపనలు కనిపించాయని పేర్కొన్నారు. రెండేళ్ల కింద వచ్చిన భూకంపాన్ని మరువకముందే తాజాగా మళ్లీ భూమి కంపించడంతో టర్కీ ప్రజలు వణికిపోతున్నారు.
2023 ఫిబ్రవరిలో టర్కీ దేశంలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భూకంపం వల్ల వేల మంది ప్రాణాలు కోల్పోయారు. సిరియాలో ప్రకంపనలు రావడంతో ఆరు వేల మంది మృతిచెందారు. ఇటీవల మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపాలు సంభవించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.