Russia President Vladimir Putin: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం.. ఉక్రెయిన్‌లో తెరపైకి తాత్కాలిక ప్రభుత్వం

Russia President Vladimir Putin suggests putting Ukraine under UN-sponsored external governance: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. యుద్ధం మొదలై నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టినా.. పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ట్రంప్ జోక్యం చేసుకొని కాల్పుల విరమణకు చొరవ తీసుకున్నా.. అవి ముందకు సాగడం లేదు. జెలెన్ స్కీపై ఒత్తిడి తెచ్చి అలివిగాని షరతులు విధిస్తున్నా.. మరో పక్క పుతన్‌ను పల్లెత్తు మాట అనడం లేదు ట్రంప్. ఇదే అలుసుగా తీసుకున్న పుతిన్ మరింత రెచ్చిపోతున్నాడు. ఉక్రెయిన్‌తో ఎలాంటి చర్చలు లేవు. ముందుగా ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీని సాగనంపి అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను తాజాగా తెరపైకి తెచ్చాడు పుతిన్. ఈ ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది.
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్ ప్రస్తుతం మరింత రెచ్చిపోతున్నాడు. ఇటు ఉక్రెయిన్‌ను.. అటు అమెరికాను అస్సలు పట్టించుకోవడం లేదు. కాల్పుల విరమణకు ప్రారంభంలో కొంత అనుకూలంగా ఉన్నట్ల కనిపించినా.. ప్రస్తుతం ఆయన మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. తాను చెప్పిందే అందరూ వినాలనే ధోరణలో పుతిన్ వ్యవహరిస్తున్నాడు. ఉక్రెయిన్ సైనికులను తమ సైనికులు ఎదుర్కొంటారని చెబుతూనే ఉక్రెయిన్‌లో వెంటనే జెలెన్ స్కీని గద్దె దించాలని డిమాండ్ చేస్తున్నాడు. అక్కడ అంతర్జాతీయ సమాజం ద్వారా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే వాదనను తెరపైకి తెచ్చాడు. ఉక్రెయిన్‌లో తన హవా నడిచేలా పుతిన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. తనకు అనుకూలంగా ఉండే వారితో ప్రభుత్వం ఏర్పాటు చేయించుకోవాలనేది పుతిన్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే జెలెన్‌స్కీని గద్దె దింపడాన్ని అమెరికా ఒప్పుకోవడం లేదు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చడానికి వీల్లేదని ట్రంఫ్ అడ్మినిస్ర్టేషన్ క్రెమ్లిన్ ప్రతిపాదనను తిరస్కరించింది.
కాగా పుతిన్ ఉక్రెయిన్‌లో జెలెన్ స్కీని పంపించి ఆయన స్థానంలో కొత్త ప్రభుత్వాన్ని తేవాలనే ప్రతిపాదనను శుక్రవారం నాడు తెరపైకి తెచ్చారు. ఉక్రెయిన్ సైనికులను తమ సైనికులు పూర్తి తుడిచిపెట్టేస్తారన్నారు. అయితే పుతిన్ తాజా వ్యాఖ్యాలపై ట్రంప్ మాత్రం కాల్పుల విరమణ ఒప్పందానికి రావాల్సిందిగా పుతిన్‌ను బుజ్జగిస్తున్నాడు. కాగా ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత పుతిన్‌తో సంబంధాలు మెరుగుపర్చుకోవాలనుకుంటున్నాడు. పుతిన్‌తో తాను నేరుగా మాట్లాడుతాను. సౌదీ అరేబియాలో కలుస్తాను అని పలుమార్లు తన మనసులోని మాట చెప్పడంతో పుతిన్‌తో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిపోయింది. ఉక్రెయిన్‌పై ఒంటికాలిపై చిందులేస్తున్నాడు. కాగా గత మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇరువైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఉక్రెయిన్ భయం విషయానికి వస్తే అమరికా మద్దతు కోల్పోతే తర్వాత జరిగే శాంతి చర్చల్లో దాదాపు మాస్కోకు అనుకూలంగా ఉండే డీల్ జరుగుతుందనే భయం ఉక్రెయిన్‌ను వెంటాడుతోంది.
ఇక తాజాగా పుతిన్ ఉక్రెయిన్‌లో జెలెన్ స్కీని తప్పించాలనే డిమాండ్‌ను మరోమారు తెరపైకి తెచ్చాడు. కీవ్‌లో మాస్కో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది పుతిన్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా పుతిన్ శుక్రవారం నాడు ఆర్కిటిక్ ఫోరమ్ సదస్సులో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ప్రభుత్వం మార్పు గురించి కావాలనుకుంటే అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలతో ను తమ భాగస్వాములు, మిత్రులతో పాటు ఐక్యరాజ్యసమితి సమక్షంలో చర్చించడానికి తాము సిద్దంగా ఉన్నామన్నారు. ముందుగా ఉక్రెయిన్‌లో అంతర్జాతీయ సమాజం పర్యవేక్షణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందేనని తన డిమాండ్‌ను కాస్తా బలంగా వినిపించారు.
ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యపద్దతిలో ఎన్నికలు జరిపించి. ఫలితాలు వచ్చాక అక్కడ స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే .. అప్పుడు కావాలనుకుంటే కొత్త ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతాం.. కావాలనుకుంటే శాంతి చర్చల డాక్యుమెంట్లపై సంతకాలు చెద్దామన్నారు పుతిన్. కాగా ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించింది. కాగా పుతిన్ ఉక్రెయిన్‌ను పది రోజుల్లో దారితెచ్చుకోవచ్చు అనుకున్నాడు. తీరా చూస్తే యుద్ధం ఎంతకు ముగియడం లేదు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో పుతిన్ బహిరంగంగానే ఉక్రెయిన్ జనరల్స్‌ను వెంటనే జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని కూల్చాలని ఒత్తిడి తెచ్చాడు. జెలెన్‌స్కీని నియోనాజి నియంత అని డ్రగ్ అడిక్ట్ అని పలుమార్లు విమర్శించాడు. కాగా జెలెన్ స్కీకి ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌గా ఉండేందుకు ఎలాంటి అర్హత లేదని పలుమార్లు పుతిన్ జెలెన్‌స్కీపై మండిపడ్డారు.. కాగా జెలెన్ స్కీ ఐదేళ్ల పదవి కాలం మే 2024తో ముగిసింది.
అయితే ఉక్రెయిన్ చట్టాల ప్రకారం యుద్ధాలు జరిగేటప్పుడు ఎన్నికలు తాత్కాలికంగా రద్దు చేయబడతాయి. అలాగే దేశంలోని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ యుద్ధం ముగిసే వరకు ఎన్నికలు వద్దని వారు కూడా సర్దుబాటు దోరణిలోనే ఉన్నారు. ఇక పుతిన్ విషయానికి వస్తే గత పాతిక సంవత్సరాల నుంచి రష్యాలో ప్రతిపక్షాలను అణగదొక్కి తానే ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. తనకు ఎవరైనా పోటీకి దిగితే వారి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నాడు. అదే ఉక్రెయిన్ విషయానికి వస్తే అక్కడ ప్రజాస్వామ్యం లేదని మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఉక్రెయిన్ రాజకీయ నాయకలు పుతిన్‌పై మండిపడుతున్నారు. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో పుతిన్ మరింత రెచ్చిపోతున్నాడు. తన సైనికులను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. యుద్ధ రంగంలో ఉక్రెయిన్ సైనికులను చీల్చి చెండాడండని ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌పై దాడులను ముమ్మరం చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేశాడు.
ఇప్పటి వరకు తాను తన సైనికులను కాస్తా నియంత్రణ పాటించాలని ఆదేశించాను . ఇక అవసరం లేదు ముందుగా ఉక్రెయిన్ సైనికులను ఫినిష్ చేయమని చెబుతున్నా.. త్వరలోనే ఉక్రెయిన్ సైనికులను పూర్తిగా లేపేస్తామని ఆయన ధీమాతో ఉన్నారు. క్రమంగా ఉక్రెయిన్‌పై పట్టుసాధిస్తామని.. స్పెషల్ ఆపరేషన్ ద్వారా ఉక్రెయిన్ మొత్తం తమ చేతికి వస్తుందని పుతిన్ నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉండగా రష్యా సైనికులును శుక్రవారం నాడు ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతమైన ఖార్కోవ్ రీజియన్‌లోని పలు గ్రామాలను స్వాధీనం చేసుకుంది. అలాగే రష్యాలోని కుర్ర్సు రీజియన్ నుంచి ఉక్రెయిన్ దళాలను తరిమేసి ఆ ప్రాంతాన్ని తిరిగి హస్తగతం చేసుకున్నామని రష్యా ఆర్మీ తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా మాత్రం ఇంకా పాత పాట పాడుతూనే ఉంది. పుతిన్‌ను ఉక్రెయిన్‌తో కాల్పుల ఒప్పందానికి అంగీకరించాలని బతిమాలుకుంటోంది. మరో పక్క పుతిన్ ఉక్రెయిన్‌లో జొరబడి ఒక్కో రీజియన్‌ను ఆక్రమించుకుంటూ పోతున్నాడు.
కాగా పుతిన్ అమరికా – ఉక్రెయిన్‌లు కలిసి 30 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించాడు. మొత్తానికి చూస్తే పుతిన్ ఆలోచనా ధోరణి మారింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ట్రంప్ స్వయంగా పుతిన్‌తో మాట్లాడి కాస్తా తగ్గు అన్నా పట్టించుకొనే పరిస్థితి లేదు. దానికి కారణం అమెరికానే అని చెప్పుకోవచ్చు. ట్రంప్ ప్రెసిడెంట్‌గా బాద్యతలు చేపట్టిన వెంటనే కాస్తా కంగారుపడ్డాడు పుతిన్. ఆ తర్వాత ట్రంప్ పుతిన్‌ను వెనుకేసుకురావడం.. పుతిన్ మంచివాడు.. తప్పంతా జెలెన్‌స్కీదే అని పలుమార్లు చెప్పడంతో పుతిన్‌లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిపోయింది. వైట్‌హౌస్‌లో ఇటు జెలెన్ స్కీ.. అటు ట్రంప్, జెడీ వాన్స్‌ల మాటల యుద్ధం యావత్ ప్రపంచ చూసి ముక్కన వేలేసుకుంది. అప్పుడు క్రెమ్లిన్‌లో కూర్చుని పుతిన్ కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు. వీరిలో వీరు కొట్టుకొని చస్తున్నారు. వీరు తనను ఏమీ చేయలేరన్న ధీమాతో పుతిన్ రెట్టించిన ఉత్సాహంతో సరికొత్త షరతులు విధిస్తున్నాడు. ఈ మొత్తం ఏపిసోడ్‌లో తెలివైన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది ఖచ్చితంగా పుతినే అని చెప్పుకోవాల్సిందే.