Tumbbad: సర్‌ప్రైజ్.. మళ్లీ ఓటీటీకి వచ్చిన ‘తుంబాడ్’ – ఎక్కడ చూడాలంటే!

Tumbbad Movie OTT Streaming Details: కొన్ని సినిమాలు ఎప్పటి అవుట్ డేటెడ్ కావు. ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి చిత్రమే ‘తుంబాడ్’. 2018లో బాలీవుడ్‌లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్‌లో విడుదలైంది. అప్పుడు అంతగా ఈ సినిమా ప్రేక్షక ఆదరణకు నోచుకోలేదు. అయితే ఓటీటీకిలో మాత్రం ఈ సినిమా అదరగొట్టింది. చాలా మంది ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తి చూపించారు. ఓటీటీలో తుంబాడ్‌కు విశేష ఆదరణ రావడంతో ఈ చిత్రాన్ని రీరిలీజ్ పేరుతో మళ్లీ థియేటర్లోకి తీసుకువచ్చారు.
అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని సీన్స్ జోడించి పార్ట్ 2 ఉందని తెలిపారు. అయితే రీ రిలీజ్‌లో రికార్డు కలెక్షన్స్‌తో అదరగొట్టిం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో తుంబాడ్ కూడా ఒకటిగా నిలిచింది. ఒటీటీకి రిలీజ్ తర్వాతే ఈ సినిమా ఈ స్థాయిలో ఆదరణ వచ్చింది. మొదట అమెజాన్ ప్రైంలో ఈ చిత్రం విడుదలైంది. రీరిలీజ్ తర్వాత కూడా కొంతకాలంగా అమెజాన్ ప్రైంలో అందుబాటులో ఉంది. అయితే ఆ తర్వాత సడెన్ తుంబాడ్‌ను అమెజాన్ నుంచి తొలగించారు.
దీంతో మూవీ లవర్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. అమెజాన్ తప్పా ఈ సినిమా మరెక్కడ లేకపోవడంతో తుంబాబు చూడాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది. అయితే ఇప్పుడు ఈ కల్ట్ క్లాసిక్ మూవీ మళ్లీ ఓటీటీలోకి వచ్చింది. అదే అమెజాన్ ప్రైంలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌లో తుంబాడ్ తెలుగుతో పాటు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రీరిలీజ్‌లో థియేటరల్లో పార్ట్ 2కి సంబంధించిన సీన్స్ మాత్రం ఓటీటీ వెర్షన్‌లో మిస్ అయ్యాయి. తుంబాడ్ మళ్లీ ఓటీటీకి రావడంతో ఈ మూవీ లవర్స అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.