Odela 2 OTT Release: ‘ఓదెల 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది – మరికొన్ని గంటల్లోనే స్ట్రీమింగ్, ఎక్కడ చూడాంటే!

Odlea 2 OTT Release and Streaming Details: తమన్నా ప్రధాన పాత్రలో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఓదెల 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అధికారికంగా ప్రకటించింది. కాగా తమన్నా శివశక్తిగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వలేదనిపించింది. కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం నిరాశపరిచింది.
2022లో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్‌కు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. హెబ్బా పటెల్, సింహా వశిష్టలు ప్రధానలో పాత్రలో వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ ఓటీటీలో రిలీజై సూపర్ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ఓదెల2ని తీసుకువచ్చారు. హెబ్బా పటేల్, వశిష్ట సంహాలు కీ రోల్లో నటించిన ఈ సినిమాకు డైరెక్టర్ సంపత్ నంది స్క్రీన్‌ప్లే అందించారు. తొలి పార్ట్ దర్శకత్వం వహించిన అశోక్ తేజనే సీక్వెల్‌కి కూడా దర్శకం వహించారు. తమన్నా శివశక్తిగా కనిపిస్తుండటంతో మూవీపై మంచి బజ్ నెలకొంది.
ఇందులో మహిళా సాధువు తమన్నా తన నటనతో మెప్పించింది. ఈ మూవీ విడుదలై నెల రోజులు కూడా తిరక్కుండానే ఓదెల 2ని ఓటీటీకి తీసుకువస్తున్నారు మేకర్స్. అమెజాన్ ప్రైం ఈ మూవీ రైట్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మే 8న అంటే ఈ రోజు అర్థరాత్రి నుంచి ఓదెల 2 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సందరు సంస్థ ప్రకటన ఇచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఓదెల 2 అందుబాటులోకి రానుంది. మే 8 రేపటి నుంచి ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. మరి ఇంకేందుకు ఆలస్యం థియేటర్లలో మిస్ అయిన వారు ఈ సినిమా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
#Odela2 – @PrimeVideoIN – Tomorrow.#tammanahbhatia pic.twitter.com/zpgiZxf0XG
— Matters Of Movies (@MattersOfMovies) May 7, 2025