Chiranjeevi-Anil Ravipudi Movie: నయనతార కోసం చెన్నైకి అనిల్ రావిపూడి – ఎందుకంటే!

Anil Ravipudi Flying to Chennai To Meet Nayanthara: డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఆడియన్స్ ఏదో తెలియని జోష్ వస్తుంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో అన్ని వర్గాల ఆడియన్స్‌ని మెప్పిస్తారు. ఇంతవరకు ప్లాప్ చూడని హిట్ డైరెక్టర్ ఈయన. ఆయన దర్శకత్వంలో రూపొందిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టరే. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయబోతున్నారు.
మెగా157(Mega 157) అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమాలో కాస్ట్ వేట్‌లో పడ్డారు అనిల్ రావిపూడి. అయితే ఇందులో చిరు సరసన స్టార్ హీరోయిన్ నయనతారను పరిశీలిస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మేకర్స్ నయన్‌ను సంప్రదించగా.. ఈ భామ భారీగా డిమాండ్ చేసింది. ప్రస్తుతం నయనతార చేతిలో పెద్దగా ప్రాజెక్ట్స్ లేవు. అయినప్పటికీ పారితోషికం భారీగా అడిగి మేకర్స్‌కి చుక్కలు చూపించిందంటున్నారు. సుమారు రూ. 18 కోట్లు డిమాండ్ చేసిందని టాక్. స్క్రీప్ట్ డిమాండ్ మేరకు నయనతారనే అయితేనే ఈ సినిమాలో పర్ఫెక్ట్ మ్యాచ్ అని, అందుకే ఆమె అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ కూడా సిద్దమయ్యారట.
అయితే ఇప్పటికే అనిల్ రావిపూడి నయన్‌కి కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. దీంతో చిరు సరసన హీరోయిన్‌గా ఫైనల్ చేశారనేది గుసగుస. అయితే ఇప్పుడు ఆమెను కలిసేందుకు అనిల్ రావిపూడి చెన్నై వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ రోజు ఉదయమే ఆయన చెన్నైకి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నయన్‌తో భేటీ అయ్యి, స్టోరీ సిట్టింగ్స్ జరగబోతున్నాయని తెలుస్తోంది. ఇందులో నయన్‌తో పాటు మరో హీరోయిన్ క్యాథరిన్ థెరిస్సా కూడా నటించనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటితో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ స్పాన్సర్‌పై చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.