Britain: వర్క్ ఫ్రం పబ్.. డీల్ అదిరింది గురూ..!
కరోనా మహమ్మారి పుణ్యమా అని మానవుడి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పని ప్రదేశాలను, పని పరిస్ధితులను సమూలంగా కొవిడ్ మార్చివేసింది. వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్ వంటి పద్ధతులు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రం పబ్ అనే మాట ఎప్పుడైనా విన్నారా.. అయితే ఈ కథనం చదివెయ్యండి.
Britain: కరోనా మహమ్మారి పుణ్యమా అని మానవుడి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పని ప్రదేశాలను, పని పరిస్ధితులను సమూలంగా కొవిడ్ మార్చివేసింది. వర్క్ ఫ్రం హోం, రిమోట్ వర్కింగ్ వంటి పద్ధతులు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రం పబ్ అనే మాట ఎప్పుడైనా విన్నారా.. ఇటీవల బ్రిటన్‌లో ఉద్యోగులను ఆకట్టుకునేందుకు పబ్‌లు వర్క్ ఫ్రం పబ్ సెటప్‌కు తెరపైకి తీసుకువచ్చాయి.
మారుమూల ప్రదేశాల నుంచి పనిచేసే ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం పబ్ సర్వీసులను బ్రిటన్‌లోని పలు పబ్ లు ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్నెట్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ఉద్యోగుల పడుతున్న అవస్థలు చూసి ఈ వర్క్ ఫ్రం పబ్ ఐడియాతో బ్రిటిష్ పబ్‌లు బిజినెస్ చేసేందుకు సిద్ధమయ్యాయి. కాగా వైఫై, చార్జింగ్ స్పాట్, ఫుడ్, డ్రింక్స్ వంటి ప్యాకేజ్లతో ఉద్యోగుల ముందుకు వర్క్ ఫ్రం పబ్ సెటప్‌ను తెచ్చాయి. ఫుల్లర్ చైన్‌కు చెందిన 380 పబ్‌లు రోజుకు రూ 900 నుంచి, యంగ్స్కు చెందిన 185 పబ్‌లు రోజుకు రూ 1300 ఛార్జ్ చేస్తూ వర్క్ ఫ్రం పబ్ డీల్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ డీల్‌లో భాగంగా లంచ్, డ్రింక్, వైఫైలను పబ్‌లు సమకూరుస్తాయి.
ఇదీ చదవండి: జుకర్‌బర్గ్‌కు తగ్గిన ఫాలోవర్లు.. 11కోట్ల నుంచి 10వేలకు..!