Home / Britain
డాగ్‌ఫ్లేషన్ అనేది పెంపుడు జంతువులకు ఆహారం,సంరక్షణ లకు పెరుగుతున్న ధరల కొలమానంగా ఉద్భవించింది. బ్రిటన్‌లో పెంపుడు జంతువును చూసుకునే ఖర్చు రెండు రెట్లు పెరిగింది. దీనితో దేశంలోని కుక్కల పునరావాస స్వచ్ఛంద సంస్థలు గతంలో ఎన్నడూ లేనంత డిమాండ్ ని ఎదుర్కొంటున్నాయి.
యునైటెడ్ కింగ్ డమ్ యొక్క నేషనల్ హెల్త్ సర్వీస్ ( ఎన్ హెచ్ ఎస్ )లో ప్రతీ ముగ్గురు మహిళా సర్జన్‌లలో ఒకరు గత ఐదేళ్లలో లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ సర్వేను సభ్యులు శస్త్రచికిత్స కోసం #MeToo ఉద్యమం"గా అభివర్ణించారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సర్జరీ నిర్వహించిన సర్వేలో బీబీసీ మరియు టైమ్స్ నివేదికల ప్రకారం 11 అత్యాచార సంఘటనలు కూడా ఉన్నాయి.
18వ శతాబ్దపు మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన అరుదైన తుపాకీ పై బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టిప్పు సుల్తాన్ తుపాకీ ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ తుపాకీ దేశం దాటి వెళ్లకూడదని పేర్కొంది.
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చేజేతులా ప్రధానమంత్రి పదవిని కోల్పోయి ప్రస్తుతం మాజీ అయ్యారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంటే తను మాత్రం తన అధికారిక భవనం 10 డౌనింగ్ స్ట్రీట్ మిత్రులతో కలిసి మందుపార్టీలు చేసుకుంటూ బిజీగా గడిపారు
King Charles Coronation: బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా జరిగింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో బ్రిటన్ కిరీటాన్ని ధరించారు.
బ్రిటన్ రాజు ఛార్లెస్ -3 పట్టాభిషేకం అట్టహాసంగా నిర్వహించారు. శనివారం లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.
King Charles III: ఈ రోజు ప్రపంచం దృష్టి బ్రిటన్ వైపు చూస్తుంది. ఆధునిక యుగంలో ఓ రాజు పట్టాభిషేకం జరుగుతోందిక్కడ.
King Charles III: బ్రిటన్ లో 70 ఏళ్ల తర్వాత పట్టాభిషేకం జరగనుంది. ఈ మహా ఘట్టానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ వేడుకకు భారతీయులు కూడా హాజరవుతున్నారు.
లాఫింగ్ గ్యాస్‌గా పిలిచే నైట్రస్ ఆక్సైడ్‌ను ఈ ఏడాది చివరి నాటికి నిషేధించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ గ్యాస్‌ను సి క్లాస్ డ్రగ్‌గా వర్గీకరిస్తారు. దానిని విక్రయించడం మరియు ఉపయోగించడం నేరంగా పరిగణించబడుతుంది,
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియమ్స్ భార్య కేట్ మిడిల్టన్ కు వివాహానికి పూర్వమే సంతానోత్పత్తి పరీక్షలు నిర్వహించారా? అంటే అవుననే అంటున్నారు రచయిత టామ్ క్విన్ . ఈ జంట వివాహం గురించి ఆయన రాసిన Gilded Youth: An Intimate History of Growing Up in the Royal Family అనే పుస్తకంలో ఈ విషయాన్ని వెల్లడించారు.