Ginger Tea: అల్లం టీ అదే పనిగా తీసుకుంటే ఈ ఇబ్బందులు తప్పవు!
వర్షాకాలం, శీతాకాలం అని తేడా లేకుండా చాలా మంది అల్లం టీని తాగుతుంటారు. కానీ అల్లం టీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు.
Ginger Tea: మనలో చాలా మంది ఉదయాన్నే అల్లం టీ తాగుతుంటారు. చాలా ఇష్టంగా దీన్ని తాగుతుంటారు.రుచి బాగుందని, ఆరోగ్యానికి మంచిదని, కప్పులకు కప్పులు తాగేస్తుంటారు. కానీ అల్లం టీ లో అల్లం లేకపోతే చాలా మందికి ఇష్టం ఉండదు. కొంత మందికి అల్లం వేస్తే చాలా ఇష్టం. ఇది టీ రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాగా జలుబు చేసినా, దగ్గు వచ్చినప్పుడు ఘాటైన ఒక్క అల్లం టీ ఒక్క కప్పు తాగితే చాలు. ఉపశమనంగా అనిపిస్తుంది. అందుకే వర్షాకాలం, శీతాకాలం అని తేడా లేకుండా చాలా మంది అల్లం టీని తాగుతుంటారు. కానీ అల్లం టీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు.
అల్లం ఎక్కువగా తీసుకుంటే ఈ నష్టాలు తప్పవు..
అల్లం ఎక్కువుగా తీసుకుంటే, దాని వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అవసరానికి మించి అల్లం తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, కడుపు నొప్పి మొదలైన ఇబ్బందులు కలిగిస్తాయి. అల్లం టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా సమస్యలు వచ్చే అవకాశాలులేకపోలేదు. అలాగే జీర్ణకోశ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముంది. అందుకే అల్లం వేసుకొని టీ ఎక్కువ తీసుకోకూడదు. అల్లంలో యాంటీ ప్లేట్లెట్స్ ఎక్కువుగా ఉంటాయి. అల్లంలోని ఈ లక్షణాలు మనకి రక్తస్రావం కలిగిస్తాయి. ఇంకొంత మంది నల్ల మిరియాలు, లవంగాలు వంటి మసాలా దినుసులు కూడా అల్లం టీలో వేస్తుంటారు.