Turmeric For Weight Loss : పసుపును ఇలా వాడితే.. ఈజీగా బరువు తగ్గొచ్చు !

Turmeric For Weight Loss: పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇందులోని ప్రత్యేక లక్షణాలు బరువు తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి.
బరువు తగ్గడానికి పసుపు ఎలా సహాయపడుతుంది ?
జీవక్రియను పెంచుతుంది: పసుపులో ఉండే కుర్కుమిన్ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఇది ముఖ్యంగా కొవ్వును తగ్గించడానికి. అంతే కాకుండా శక్తి పెంచడానికి సహాయపడుతుంది.
బెల్లీ ఫ్యాట్: కర్కుమిన్ కొవ్వు కణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో అదనపు కొవ్వు పెరగకుండా చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఇది సహజ కొవ్వును నిరోధించే , బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించే లక్షణాలను పెంచుతుంది.
వాపును తగ్గిస్తుంది: మన శరీరంలో వాపు లక్షణాలు పెరగడం వల్ల బరువు పెరగుతారు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా , సమతుల్యంగా ఉంచుతాయి. శరీరంలో వాపు తగ్గినప్పుడు, బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాపు సాధారణ శరీర విధులను ప్రభావితం చేస్తుంది.
ఇన్సులిన్: పసుపు తరచుగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు అసమానంగా ఉండటం వల్ల బరువు పెరుగుతుంది.
జీర్ణక్రియ: పసుపు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది ప్రేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది . అంతే కాకుండా మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. తద్వారా శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడానికి పసుపును ఎలా ఉపయోగించాలి ?
పసుపు, తేనె మిశ్రమం: ఒక టీస్పూన్ పసుపును ఒక టీస్పూన్ తేనెతో కలిపి గోరువెచ్చని నీటితో తాగాలి. ఇది శరీరం నుండి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పసుపు పాలు: పసుపు పాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఒక కప్పు పాలలో అర టీస్పూన్ పసుపు, కొద్దిగా నల్ల మిరియాలు కలిపి రోజుకు ఒకసారి తీసుకోండి. ఇది మీ జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. నల్ల మిరియాలలో పైపెరిన్ ఉంటుంది. ఇది పసుపును గ్రహించడంలో సహాయపడుతుంది.
పసుపు, నిమ్మరసం: పసుపు, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర స్పూన్ నిమ్మ రసం, ¼ టీస్పూన్ పసుపు కలిపి ఉదయం పరగడుపున తాగాలి. ఇది మీ జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా శరీరానికి మేలు చేస్తుంది.
పసుపు టీ: పసుపు టీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఒక కప్పు నీటిలో పసుపు, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క వేసి మరిగించి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ టీ జీవక్రియను పెంచుతుంది. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది.
పసుపు, అల్లం మిశ్రమం: బరువు తగ్గడంలో పసుపు, అల్లం చాలా మేలు చేస్తాయి. ఈ రెండూ వాపును తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.