Published On:

Weight Loss: డైలీ మార్నింగ్ ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. త్వరగా బరువు తగ్గొచ్చు !

Weight Loss: డైలీ మార్నింగ్ ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. త్వరగా బరువు తగ్గొచ్చు !

Weight Loss: బరువు తగ్గడం అంత తేలికైన పని కాదని చెబుతుంటారు. ఎందుకంటే బరువు త్వరగా పెరిగినప్పటికీ దానిని తగ్గించడానికి చాలా సమయం పడుతుంది. మీరు ఉదయం తినే సమయం, ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా బరువు తగ్గవచ్చు. అవును, ఎల్లప్పుడూ ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి అలాగే నాజూకుగా కనిపించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం . టిఫిన్ మీ శరీరానికి, అలాగే మీ మెదడుకు ఇంధనంగా పనిచేస్తుందని , ఇది మీ జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని చెప్పవచ్చు. దీని వల్ల, మీ నడుము చుట్టూ కొవ్వు అస్సలు పేరుకుపోదు. అంతే కాకుండా మీరు చాలా వరకు కేలరీలను బర్న్ చేయవచ్చు.

టిఫిన్ మానేస్తే బరువు తగ్గొచ్చన్న ఆలోచన పూర్తిగా తప్పు ఎందుకంటే ఇది మీ బరువును పెంచదు కానీ అది మీ కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. వారానికి 5 నుండి 6 రోజులు ఉదయం టిఫిన్ తీసుకున్న వ్యక్తులు బరువు పెరగలేదని అనేక పరిశోధనల్లో రుజువైంది. కాబట్టి ఈ విధంగా.. మీరు తినే టిఫిన్ లో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ పెరగకుండా జాగ్రత్తపడవచ్చు.

ఉదయం నిద్ర లేచిన అరగంటలోపు టిఫిన్ తినండి. దీనికి కూడా కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీరు 7 నుండి 8 గంటలు నిద్రపోయిన తర్వాత మేల్కొంటే మీ శరీరానికి ఇంధనం అవసరం. ఎందుకంటే మీరు ఉదయం టిఫిన్ తీసుకోకపోతే, మీ జీవక్రియ మందగిస్తుంది. అంతే కాకుండా మీ శరీరం కేలరీలను బర్న్ చేయడాన్ని ఆపివేస్తుంది. కాబట్టి.. మీరు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు అరగంటలోపు టిఫిన్ తినండి.

ముందుగా నీళ్లు తాగండి:
మీరు బరువు తగ్గాలని , మీ శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవాలనుకుంటే.. ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఈ అలవాటు బరువు తగ్గడంతో పాటు మీ ఆరోగ్యానికి చాలా మంచిది. నిజానికి.. మీరు టిఫిన్ తినే ముందు, ఏదైనా తినడానికి ముందు ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగితే.. మీరు 100 పౌండ్ల బరువు తగ్గుతారు.

ఫైబర్ అధికంగా ఉండే ఆహారం:
మీరు మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకుంటే.. అది మీ ఆకలిని ఎక్కువసేపు అణిచివేస్తుంది. కాబట్టి.. మీ టిఫిన్‌లో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి. మీకు రోజంతా ఆకలిగా అనిపిస్తే , జంక్ ఫుడ్ తినాలని అనిపిస్తే, ఈ కోరిక నుండి దూరంగా ఉండటానికి మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.

బరువు తగ్గడానికి మసాలా ఓట్స్:
టిఫిన్‌కు ఓట్స్ ఉత్తమమైన ఆహారం. ఓట్స్‌లో అవసరమైన పోషకాలు , ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి చాలా మంచివి. మీరు డాలియా తినడానికి ఇష్టపడకపోతే మసాలా ఓట్స్ తినవచ్చు.

ఉప్మా ఒక ఆరోగ్యకరమైన ఎంపిక:
మీరు డైట్‌లో ఉంటే ఉప్మా తయారు చేసుకుని కూడా తినవచ్చు. అందులో వీలైనన్ని ఎక్కువ కూరగాయలు వేయండి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది దీనిని తరచుగా తీసుకోవడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు.

కార్న్ ఫ్లేక్స్:
తక్కువ సమయంలో ఆరోగ్యకరమైన టిఫిన్ గా తీసుకోవడానికి కార్న్ ఫ్లేక్స్ మంచి ఎంపిక . మీరు పాలతో పాటు కార్న్ ఫ్లేక్స్ తినడం ద్వారా మీ జీవక్రియ రేటును పెంచుకోవచ్చు. అంతే కాకుండా వీటిని తినడం ద్వారా శరీర శక్తి కూడా పెంచుకోవచ్చు.

పోహా:
పోహా తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి కూడా అంతే మంచిది. పోహా చాలా తేలికైన ఆహారం అని చెప్పవచ్చు. ఇది సులభంగా జీర్ణమవుతుంది. దీనికి అనేక రకాల కూరగాయలను కలిపి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఉదయం టిఫిన్ సమయంలో ఒక గ్లాసు మజ్జిగలో పోహా కలిపి తాగితే.. మీరు చాలా సేపు ఉత్సాహంగా ఉంటారు. బరువు కూడా పెరగరు.

ఇవి కూడా చదవండి: