Published On:

Women Fatigue in Summer: మహిళలు.. సమ్మర్ లో అలసట సమస్యలా..? కారణాలివే!

Women Fatigue in Summer: మహిళలు.. సమ్మర్ లో అలసట సమస్యలా..? కారణాలివే!

Causes of Women Fatigue in Summer: ఎండాకాలంలో మహిళలు, అలసటకు ఎక్కువగా గురవుతుంటారు. ఇది ఒక సాధారణ సమస్యే అని అనుకుంటారు. కానీ దీని వెనుక అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ప్రధాన కారణం డీహైడ్రేషన్. అంటే శరీరంలో నీరు లేకపోవడం అని అర్థం.

 

వేసవిలో చెమటలు: వేసవిలో మనకు చెమటలు ఎక్కువగా పడతాయి. ఇలాంటి పరిస్థితిలో.. నీరు మాత్రమే కాకుండా ఎలక్ట్రోలైట్లు (సోడియం, పొటాషియం మొదలైనవి) కూడా శరీరం నుండి బయటకు వెళ్లిపోతాయి. ఎలక్ట్రోలైట్ల పని శరీరంలోని ముఖ్యమైన విధులను నియంత్రించడం, కండరాలను కదిలించడం, హృదయ స్పందనను నియంత్రించడం మొదలైనవి. ఇవి శరీరంలో సక్రమంగా జరగనప్పుడు అలసట, కండరాల బలహీనత, తలనొప్పి, మైకము, వికారం వంటి సమస్యలు కూడా వస్తాయి.

 

హార్మోన్ల మార్పులు : స్త్రీలలో హార్మోన్ల మార్పులు కూడా అలసట, తలతిరుగడం వంటి వాటికి కారణమవుతాయి. ఉదాహరణకు పీరియడ్స్ , గర్భధారణ లేదా మోనోపాజ్ సమయంలో శరీరం యొక్క శక్తి స్థాయి కొంచెం తగ్గుతుంది. ఫలితంగా శరీరం బలహీనంగా అనిపిస్తుంది.

 

నిద్ర, ఆహారం, ఆకస్మిక శారీరక శ్రమ: తగినంత నిద్ర లేకపోయినా లేదా మీ ఆహారంలో సరిపడా పోషకాలు లేకున్నా.. మీ శరీరం త్వరగా అలసిపోతుంది. కొందరు సమ్మర్ ప్రారంభంలో మనం జిమ్‌కి వెళ్లడం లేదా బయట ఎక్కువగా తిరగడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల శరీరం కొత్త పనులకు అలవాటు పడదు. అందుకే అలసిపోయినట్లు అనిపిస్తుంది.

 

వ్యాధులు, మందులు: క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే.. వేసవిలో అలసట , తలతిరుగుడు మరింత తీవ్రంగా మారతాయి. అలాగే.. బీటా బ్లాకర్స్ లేదా కొన్ని రకాల మందులు వాడటం వల్ల అలసటకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

 

వేసవిలో అలసట, తలతిరుగుడును ఎలా నివారించాలి ?

* నీరు పుష్కలంగా త్రాగండి: రోజూ శరీరానికి తగినంత నీరు తాగండి. అంతే కాకుండా నీటిలో కాస్త ఉప్పు-నిమ్మరసం లేదా ఎలక్ట్రోలైట్లను కలిపి తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

* హైడ్రేటింగ్ డ్రింక్స్ తీసుకోండి: కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి శరీరాన్ని చల్లబరుస్తాయి. ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తాయి.

* తేలికైన , వదులుగా ఉండే దుస్తులు : శరీరం చల్లగా అనిపించడానికి లేత రంగు కాటన్ దుస్తులు మంచివి.

* సమతుల్య ఆహారం తీసుకోండి: శరీర శక్తి కోసం ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు, తగినంత కేలరీలు ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం.

 

ఇవి కూడా చదవండి: