Published On:

Heart Diseases: ఈ ఒక్క టెస్ట్‌తో.. గుండెపోటు, స్ట్రోక్‌ను ముందుగానే పసిగట్టొచ్చు తెలుసా ?

Heart Diseases: ఈ ఒక్క టెస్ట్‌తో.. గుండెపోటు, స్ట్రోక్‌ను ముందుగానే పసిగట్టొచ్చు తెలుసా ?

Heart Diseases: ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. వివిధ అధ్యయనాల నివేదికలను మనం పరిశీలిస్తే.. జీవనశైలి , ఆహారపు అలవాట్ల కారణంగా ఇటువంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని స్పష్టమవుతుంది.

కొన్ని దశాబ్దాల క్రితం వరకు గుండె జబ్బులు వృద్ధాప్యంతో సంబంధం ఉన్న సమస్యగా భావించారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, ముఖ్యంగా కరోనా నుండి, 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు దీనికి బలైపోతున్నారు.

ఇదిలా ఉంటే.. కుటుంబంలో ఎవరైనా గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తులు ఉంటే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి వ్యక్తులు తరచూ బీపీ , కొలెస్ట్రాల్‌ను కూడా క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి. తద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చు.

రక్త పరీక్షతో గుండెపోటును గుర్తించండి:

రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా, మీరు గుండె సంబంధిత సమస్యలను అంచనా వేయవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. దీంతో పాటు.. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ (LSHTM) నిపుణులు ఒక రక్త పరీక్ష గురించి సమాచారాన్ని అందించారు. దీని ద్వారా భవిష్యత్తులో గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందో లేదో నిర్ధారించవచ్చని తెలిపారు.

రక్తంలో ట్రోపోనిన్ అనే ప్రోటీన్ ఉంటుందని, దాని సహాయంతో మీకు గుండెపోటు వస్తుందా లేదా స్ట్రోక్ వస్తుందా అని తెలుసుకోవచ్చని నిపుణులు తెలిపారు.

గుండెపోటును గుర్తించడానికి పరీక్ష:

ఈ నివేదిక ప్రకారం.. ఈ పరీక్ష ఖర్చు £5 ( 565 రూపాయలు).

ట్రోపోనిన్ గుండె కండరాల కణాలలో కనిపిస్తుంది . గుండెలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు లేదా అది దెబ్బతినడం ప్రారంభించినప్పుడు, ఈ ప్రోటీన్ పరిమాణం రక్తంలో పెరగడం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం, గుండెపోటును గుర్తించడానికి అనేక ఆసుపత్రులలో హై సెన్సిటివిటీ ట్రోపోనిన్ రక్త పరీక్షను ఉపయోగిస్తున్నారు. LSHTM నిర్వహించిన ఈ అధ్యయనంలో.. హృదయ సంబంధ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి ఈ పరీక్షలను క్రమం తప్పకుండా ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

అధ్యయనంలో ఏం కనుగొన్నారు ?

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం కోసం.. యూరప్ , ఉత్తర అమెరికాలో నిర్వహించిన 62,000 మందికి పైగా పాల్గొన్న 15 కి పైగా అధ్యయనాలను బృందం విశ్లేషించింది. అంతే కాకుండా వ్యక్తుల యొక్క ట్రోపోనిన్ స్థాయిని, వయస్సు, రక్తపోటు, మధుమేహ చరిత్ర, ధూమపానం, కొలెస్ట్రాల్ స్థాయిల వంటి సాంప్రదాయ ప్రమాద కారకాలను తెలుసుకున్నారు . ఆ తరువాత పాల్గొనేవారికి గుండెపోటు లేదా స్ట్రోక్ ఉందా అని చూడటానికి దాదాపు 10 సంవత్సరాలు పరిశోధన నిర్వహించారు.

నిపుణులు ఏమంటున్నారు ?

ట్రోపోనిన్ స్థాయి పరీక్ష ఆధారంగా అంచనాలు కొలెస్ట్రాల్ , రక్తపోటు నివేదికల ఆధారంగా అంచనాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖచ్చితమైనవని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరీక్షను సాధారణ గుండె ఆరోగ్య పరీక్షలలో చేర్చడం ద్వారా.. గుండెపోటు , స్ట్రోక్ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలను రక్షించడమే కాకుండా.. గుండె జబ్బుల కారణంగా ఆసుపత్రులపై ఒత్తిడిని కూడా తగ్గించవచ్చని నిపుణులు తెలిపారు. ఈ పరీక్ష గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేయడంలో చాలా బాగా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి: