Summer Tips: సమ్మర్‌లో నాన్ వెజ్ తింటున్నారా ? ప్రమాదంలో పడ్డట్లే..

Summer Tips: వేసవి కాలంలో శరీరానికి నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. ఈ సమయంలో మనం ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. కానీ శరీరం నుండి నీటి పరిమాణాన్ని తగ్గించే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయని మీకు తెలుసా ? అంటే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. కాబట్టి.. సమ్మర్ లో వీటిని తినకుండా ఉండటం మంచిది. ఇంతకీ ఆ నాన్ వెజ్ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందామా.
1. ఫాస్ట్ ఫుడ్: బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్స్ తినడానికి రుచికరంగా అనిపిస్తాయి. కానీ ఇవి శరీరం నుండి నీటిని ఎక్కువగా బయటకు పంపుతాయి. నిజానికి.. వీటిలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది నిర్జలీకరణాన్ని పెంచుతుంది. అంతే కాకుండా ఫాస్ట్ ఫుడ్స్‌లో చాలా తక్కువ ఫైబర్ ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియలో సమస్య ఏర్పడుతుంది. అందుకే శరీరానికి ఎక్కువ నీరు అవసరం అనిపిస్తుంది.
2. మాంసాహారం: వేసవి కాలంలో ఎక్కువ కారంగా ఉండే నాన్-వెజ్ ఫుడ్ తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. మటన్, చికెన్ లేదా వేయించిన చేప వంటి ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికి శరీరం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. దీని కారణంగా శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. అందుకే డీహైడ్రేషన్ బారిన పడాల్సి వస్తుంది. ఒక వేళ సమ్మర్ లో మీరు నాన్-వెజ్ తింటున్నా కూడా.. దానిని తక్కువ మసాలాలు వేసి తయారు చేసుకుని తినండి.
3. డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఆరోగ్యకరమైనవే, కానీ సమ్మర్‌లో వాటిని అధికంగా తినడం సరైనది కాదు. వీటిలో సహజ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. అలాగే వాటిలో నీటి శాతం కూడా ఉండదు. దీనివల్ల శరీరం వాటిని జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. అందుకే నీరు ఎక్కువగా అవసరం అవుతుంది.
4. కెఫిన్ , ఆల్కహాల్ అధికంగా ఉండే డ్రింక్స్: టీ, కాఫీ , ఆల్కహాల్ డ్రింక్స్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మూత్రం పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల శరీరం నుండి నీరు త్వరగా బయటకు వస్తుంది. వేసవిలో.. మీరు రోజులో ఎక్కువ సార్లు టీ-కాఫీ లేదా చల్లని బీరు తాగితే.. నీటి కొరత ఏర్పడతుంది. వీటికి బదులుగా నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు లేదా మామిడి పన్నా వంటి హైడ్రేటింగ్ పదార్థాలను తీసుకోవడం మంచిది.
5. ఖర్జూరాలు, ఎండుద్రాక్షలు: ఖర్జూరం, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఫైబర్ , పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ అవి శరీరంలో వేడిని కూడా పెంచుతాయి. ముఖ్యంగా సమ్మర్ లో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడాల్సి వస్తుంది. మీరు వాటిని తీసుకుంటున్నప్పటికీ, తక్కువ పరిమాణంలో తిని పుష్కలంగా నీరు తాగండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాలు కూడా ఉంటాయి.