Realme Narzo 70 Turbo 5G: ఈ ఆఫర్ మిస్ చేయకండి.. రియల్‌మి గేమింగ్ ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఇంత తగ్గింపా..?

Rs 2,250 Discount on Realme Narzo 70 Turbo 5G: Realme Narzo 70 Turbo 5G గేమింగ్ స్మార్ట్‌ఫోన్ భారీగా తగ్గింది. అమెజాన్‌లో రూ.2250 డిస్కౌంట్‌తో కేవలం రూ.12,999కి కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. మొత్తం 3 వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్న ఆసక్తిగల కస్టమర్‌లు గొప్ప డీల్స్, ఆఫర్‌లతో దీన్ని కొనుగోలు చేయచ్చు.
Realme Narzo 70 Turbo 5G Price
ఈ తాజా Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం 3 మోడళ్లలో అమ్ముడవుతోంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఒంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,249. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 17,999. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 20,186.
Realme Narzo 70 Turbo 5G Offers
Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ టర్బో ఎల్లో, టర్బో గ్రీన్, టర్బో పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. అమెజాన్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ పై రియల్‌మి రూ.1,250 ప్రత్యేక కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా, మీరు బ్యాంక్ ఆఫర్ కింద క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఉపయోగించడం ద్వారా ప్రారంభ మోడల్‌ను దాదాపు రూ. 12,999 కు పొందచ్చు. అలానే రూ. 1000 అదనపు తగ్గింపు లభిస్తుంది.
Realme Narzo 70 Turbo 5G Features and Specifications
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ HD+ సామ్‌సంగ్ E4 ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇది అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇష్టపడే వినియోగదారులకు ఈ ఫోన్ గొప్ప ఎంపిక. ఎందుకంటే కంపెనీ 50MP మెగాపిక్సెల్ AI-సపోర్ట్ చేసే ప్రైమరీ రియర్ కెమెరా, 2MP మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాను అందించింది. అసెల్ఫీల కోసం 16MP మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ 5G చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇందులో 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీన్ని 26జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇది గేమింగ్ సమయంలో ఫోన్ వేడిని తగ్గిస్తుంది.ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0 పై నడుస్తుంది. కనెక్టివిటీ కోసం 5G, బ్లూటూత్ 5.4, GPS, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్, Wi-Fi వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- Discount on Samsung Galaxy S25 Ultra: ఓడియమ్మ.. సామ్‌సంగ్ గెలాక్సీ S25 Ultraపై ఇంత డిస్కౌంటా..రూ. 3,278లకే ఆర్డర్ చేసేయండి!