Home / tech news
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగ దారుల కోసం మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ సేవలను చాలా తక్కువ ధరకే పొందేందుకు వీలు కల్పించింది.
డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. 2022 ఏడాదికి గాను మన దేశంలో 89.5 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మైగవ్ ఇండియా వెల్లడించింది.
ట్విటర్లో వెరిఫైడ్ అకౌంట్ లకు ఇచ్చే బ్లూ టిక్ ను సాధారణ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని యూజర్లు తమ వెరిఫికేషన్ పొందొచ్చు.
టెక్నాలజీకి అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2023 నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులను కంపెనీలు కార్యాలయాలకు పిలుపిస్తున్నాయి. పలు టెక్ కంపెనీ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది.
యాపిల్ ఎయిర్ ట్యాగ్, శాంసంగ్ స్మార్ట్ ట్యాగ్ మాదిరి రిలయన్స్ జియో నుంచి సరికొత్త పరికరం విడుదల అయింది. ‘జియో ట్యాగ్’ పేరుతో కొత్త బ్లూటూత్ ట్రాకర్ ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వస్తువులు.. పర్స్ లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కీస్ లాంటివి..
దిగ్గజ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఎక్కువగా మహిళలే కంపెనీని వీడుతున్నట్టు తేలింది. ఈ విషయాన్ని టీసీఎస్ వెల్లడించింది. ఎంప్లాయిస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని తీసివేయడమే ఇందుకు కారణం కావచ్చని కంపెనీ అభిప్రాయ పడింది.
టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ సోషల్ మీడియా వెబ్సైట్ రెడిట్ భారీగా లే ఆఫ్స్ విధించినట్టు తెలుస్తోంది. సంస్థలో తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది.
దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకోనుంది. సంస్థ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ప్రమ్ హోమ్‌ను తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీని కోసం నూతన వర్క్ పాలసీని తయారు చేస్తున్నట్టు పలు రిపోర్స్ చెబుతున్నాయి.
కరోనా సంక్షోభంతో అన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పద్దతిని అనుసరించాయి. దాదాపు మూడేళ్లుగా ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ముగింపు పలుకుతున్నాయి.