Published On:

Moto G86: మోటో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కేక పెట్టిస్తున్న ఫీచర్లు.. కొంటే మాములుగా ఉండదు..!

Moto G86: మోటో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కేక పెట్టిస్తున్న ఫీచర్లు.. కొంటే మాములుగా ఉండదు..!

Moto G86: మోటరోలా త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో G86 ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే, లాంచ్ కు ముందే, స్మార్ట్‌ఫోన్ ధర, కలర్ ఆప్షన్స్ లీకైన నివేదికలలో వెల్లడయ్యాయి. ఇప్పుడు తాజా నివేదికలో, రాబోయే మోటరోలా స్మార్ట్‌ఫోన్ రెండర్‌లు లీక్ అయ్యాయి. ఇది ఫోన్ డిజైన్‌ను వెల్లడించింది. మోటరోలా నుంచి ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ Moto G85కి సక్సెసర్‌గా తీసుకొస్తుంది. దీని అర్థం ఈ రాబోయే ఫోన్‌లో Moto G85 కంటే మెరుగైన ఫీచర్లు ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Moto G86 Features
Moto G86 స్మార్ట్‌ఫోన్ రెండర్‌లను బట్టి చూస్తే, దీని డిజైన్ మోటరోలా ఎడ్జ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా కెమెరా ఐలాండ్ కొన్ని రోజుల క్రితం భారతదేశంలో విడుదలైన Moto Edge 60 Fusion ని పోలి ఉంటుంది. కెమెరా మాడ్యూల్ వెనుక ప్యానెల్ ఎగువ ఎడమ వైపున కొద్దిగా పైకి లేచి ఉంటుంది. స్క్వేరిష్ మాడ్యూల్‌లో మూడు కెమెరా సెన్సార్లు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Moto G86 సన్నని బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే, సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో హోల్-పంచ్ కటౌట్‌ ఉండే అవకాశం ఉంది. పవర్ , వాల్యూమ్ బటన్లు ఫోన్ కుడి వైపున ఉంటాయి. ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ దిగువన అందుబాటులో ఉన్నాయి. సిమ్ కార్డ్ స్లాట్ ఎడమ వైపున ఉంది. ఇది కాకుండా, పైన డాల్బీ అట్మోస్ లోగో ఉన్నట్లు కనిపిస్తోంది. దీని అర్థం ఫోన్ స్పీకర్లు డాల్బీ అట్మాస్ ఆడియోకు సపోర్ట్ ఇస్తాయి.

లీకైన ఫోటోలలో ఆధారంగా ఫోన్ డార్క్ బ్లూ, పర్పుల్ అనే రెండు రంగులలో కనిపిస్తుంది. Moto G86 గోల్డ్, రెడ్ కలర్ ఆప్షన్లలో కూడా లాంచ్ అవుతుందని నివేదిక పేర్కొంది. బ్లూ కలర్ వేరియంట్ వీగన్ లెదర్ బ్యాక్ కలిగి ఉండగా, పర్పుల్ కలర్ వేరియంట్ ఫెల్ట్, టెక్స్‌టైల్ కలిపిన క్లాత్ లాంటి మెటీరియల్‌ను ఉపయోగిస్తుంది.

Moto G86 Price
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఫోన్‌లో 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌ను భారతదేశంలో రూ.17,999 కు లాంచ్ చేసే అవకాశం ఉంది.