Discount on Samsung Galaxy S25 Ultra: ఓడియమ్మ.. సామ్‌సంగ్ గెలాక్సీ S25 Ultraపై ఇంత డిస్కౌంటా..రూ. 3,278లకే ఆర్డర్ చేసేయండి!

Rs 12,000 Discount on Samsung Galaxy S25 Ultra: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S25 Ultraపై గొప్ప ఆఫర్‌ను అందించింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనడం మరింత సులభం అయింది, పొదుపు కూడా ఉంటుంది. గెలాక్సీ S25 Ultra కొనుగోలు చేస్తే, మీకు రూ. 12000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ టైటానియం సిల్వర్‌బ్లూ కలర్ వేరియంట్‌పై ఈ డీల్ అందుబాటులో ఉంది.
ఇది మాత్రమే కాదు, మీరు ఈ ఫోన్‌ను రూ. 3,278 ప్రారంభ నో-కాస్ట్ EMIకి కూడా కొనుగోలు చేయవచ్చు. సామ్‌సంగ్ గెలాక్సీ S25 Ultraపై ఈ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ వేరియంట్ ధర రూ. 1,29,999. అయితే 12000 రూపాయల క్యాష్‌బ్యాక్ తర్వాత, ఫోన్ ధర 1,17,999 రూపాయలు అవుతుంది. సామ్‌సంగ్ నుండి వచ్చిన ఈ శక్తివంతమైన ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
Samsung Galaxy S25 Ultra Features
సామ్‌సంగ్ గెలాక్సీ S25 Ultraలో 6.9-అంగుళాల క్వాడ్ HD+ డైనమిక్ అమోలెబ్ 2X డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ మొబైల్ టైటానియం బాడీ,కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 రక్షణను పొందుతుంది. కంపెనీ గెలాక్సీ AIని పూర్తిగా ఇంటిగ్రేట్ చేసింది, ఇది One UI 7తో వస్తుంది. 7 సంవత్సరాల వరకు OS, సేఫ్టీ అప్‌గ్రేడ్లను పొందుతుంది. ఈ ఫోన్‌లో నౌ బ్రీఫ్, నౌ బార్ వంటి ఫీచర్లు అందించారు, ఇవి రోజంతా వినియోగదారు ప్రవర్తన ఆధారంగా సూచనలు, కార్యాచరణ ట్రాకింగ్‌ను అందిస్తాయి.
Samsung Galaxy S25 Ultra Camera
పనితీరు కోసం, ఈ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ అందించారు . ఈ ఫోన్ 12జీబీ ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది. ఫోటోగ్రఫీ, వీడియో కోసం.. ఈ ఫోన్ 200MP + 50MP + 10MP + 50MP క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇది గొప్ప ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. సెల్ఫీ ప్రియుల కోసం, దీనికి 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌కు శక్తినివ్వడానికి, దీనికి 5000mAh బ్యాటరీ ఉంది. OS గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ OneUI 7 లో పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Oppo K13 5G Launch: 50MP AI కెమెరా, 7000mAh బ్యాటరీ.. Oppo K13 5G స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్లో హై క్లాస్ ఫీచర్స్!